close

తాజా వార్తలు

Published : 09/03/2020 16:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘కరోనా’పై ఆనంద్‌ మహీంద్రా టిప్స్‌ 

దిల్లీ: చైనాలో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే 100 దేశాలకు ఈ వైరస్‌ పాకింది. కరోనా భయాలు అటు ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. చమురు ధరలు భారీగా పతనమవడంతో భారత్‌ సహా అనేక దేశాల మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. అయితే కరోనా వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను అవకాశంగా తీసుకుని.. వాటిని భారత్‌ తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా అంటున్నారు. ఇందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. 

చమురు ధరల పతనం, కరోనా ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ఇవాల్టి మార్కెట్ల పరిస్థితిని చూస్తుంటే ప్రపంచ ఆర్థిక మాంద్యంలాగే కన్పిస్తోందని అన్నారు. అయితే ఈ సంక్షోభ పరిస్థితులను వృథా చేసుకోకుండా వాటిని మనకు అనుకూలంగా మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు. 

‘ఇప్పుడు మన ముందు మూడు అవకాశాలున్నాయి. 1. వినిమయం పెంచడంతో పాటు ద్రవ్యలోటు నుంచి బయటపడేలా లాభాలను పెంచుకునేందుకు ఈ చమురు ధరల పతనాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోవాలి. 2. పరిశుభ్రత, స్వచ్ఛ ఉద్యమాన్ని పెంచి పర్యాటకులను ఆకర్షించాలి. అప్పుడు విదేశీయులు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. 3. ప్రభుత్వం అందించే  ప్రోత్సాహకాలను పెంచడంతో పాటు విదేశీ పెట్టుబడిదారులకు నిబంధనలు తగ్గించాలి. అప్పుడు వారు చైనాలో కాకుండా భారత్‌లో ఉత్పత్తి కేంద్రాలను తెరిచే అవకాశం ఉంటుంది’ అని ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ఇదీ చదవండి.. అరేబియాలో చమురు యుద్ధం 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని