close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120053047 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1251851746101456902 [video_short_link] => 1251851746101456902 [created_by] => [created_date] => [modified_by] => 9820033 [modified_date] => 2020-04-20 14:50:13.458336 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Published : 20/04/2020 18:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గోవాలో ‘జీరో కరోనా‌’: ఈ వైద్యుడి చలవే...

పనాజీ: గోవాలో కరోనా సోకిన ఏడుగురిలో ఆఖరి వ్యక్తి చికిత్సానంతరం ఈ ఆదివారం డిశ్చార్జి ఆయ్యారు. దీనితో దేశంలో కరోనా లేని తొలి రాష్ట్రంగా గోవా రికార్డు సాధించింది. కొత్త కేసులేవీ నమోదు కాకపోవటంతో పాటు... రాష్ట్రంలోని ఏడుగురు బాధితులకు చికిత్స అనంతరం కరోనా వైరస్‌ నెగటివ్‌ అని నిర్ధారణ కావటంతో ఇది సాధ్యమయింది. ఈ సందర్భంగా గోవాలో కరోనా చికిత్సకు నోడల్‌ అధికారి అయిన ఎడ్విన్‌ గోమెజ్‌ను, ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి విశ్వజిత్‌ రాణె ప్రశంసించారు. ‘‘ఈ ప్రాణాంతక వైరస్‌ను ఎదుర్కొనేందుకు మా వైద్య బృందం ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ (ఈఎస్‌ఐ) ఆస్పత్రిలో అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. డాక్టర్‌ ఎడ్విన్‌ గోమెజ్‌ నేతృత్వంలోని ఈ ఆద్భుతమైన వైద్య బృందానికి అభినందనలు.’’ అని ట్విటర్‌లో విడుదల చేసిన ఓ ప్రకటనలో మంత్రి రాణె చెప్పారు.

‘‘ఆయన మాలో నమ్మకం కలిగించారు. తను కూడా ఒత్తిడిలో ఉన్నానంటూ, ఒత్తిడిని తొలగించే ఔషధాలు నాతో పాటు తీసుకునేవారు. ఆ విధంగా ఆయన నా ఆందోళనను తగ్గించారు. అందుకు నేను ఆయనకు రుణపడి ఉంటాను. కేవలం ఔషధాలు అందించటమే కాకుండా... గోమెజ్‌ వ్యవహరించే విధానం కూడా బాధితులకు ఉపశమనం కలిగిస్తుంది.’’ అని గోవాలో కరోనా వచ్చి, తగ్గిన మొదటి బాధితుడు ఎడ్గార్‌ రెమిడియోస్‌ అన్నారు.

ఎడ్విన్‌ గోమెజ్‌ గోవాలో ఉన్న ఏకైక వైద్య కళాశాల ‘గోవా మెడికల్‌ కాలేజ్‌’ మెడిసిన్‌ విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్నారు. 58 సంవత్సరాల వయస్సులో తనకే కరోనా వైరస్‌ వల్ల ప్రమాదం అధికంగా ఉన్న నేపధ్యంలో...  కరోనా వైరస్‌ బాధితులను మరల మామూలు స్థితికి తీసుకురావటానికి డాక్టర్‌ గోమెజ్‌ కృషికి నూటికి నూరు మార్కులు ఇవ్వవచ్చని గోవాలో ప్రముఖ వైద్యులు ఆస్కార్‌ రెబెలో అభిప్రాయపడ్డారు. తన వృత్తిపట్ల గోమెజ్‌ అంకితభావం అద్భుతమని... చుట్టూ వైరస్‌ ఆవరించిఉన్న పరిస్థితుల్లో కొవిడ్‌ వైద్య విధులు నిర్వహించటమంటే మాటలు కాదని పలువురు ప్రశంసించారు. 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.