close

తాజా వార్తలు

Updated : 21/05/2020 14:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆ దేశాలను ఒంటరి చేయాలి: ఉపరాష్ట్రపతి

దిల్లీ: ఉగ్రవాదానికి అండగా నిలుస్తున్న దేశాలను ఒంటరి చేయడానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాలని, అందుకోసం ఏకతాటిపైకి రావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ఉగ్రవాద నిర్మూలన దినోత్సవం సందర్భంగా దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు గురువారం ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వరుస ట్వీట్లు చేశారు. సమస్త మానవాళికి ఉగ్రవాదం శత్రువుగా మారిందని.. ప్రపంచ శాంతికి, అభివృద్ధికి ఇది పెద్ద ముప్పుగా పరిణమించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాలని, ఉగ్రవాదానికి సహకరిస్తున్న దేశాలను ఒంటరి చేయాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. భారత్‌లో శాంతికి విఘాతం కలిగిస్తున్న ఉగ్రమూకలను ఓడించేందుకు భద్రతా బలగాలకు అండగా పౌరులందరూ తమ ఐకమత్యాన్ని చాటాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 29వ వర్ధంతి సందర్భంగా ఈ రోజును ఉగ్రవాద నిర్మూలన దినోత్సవంగా పాటిస్తున్న సంగతి తెలిసిందే. 

రాజీవ్‌గాంధీకి మోదీ నివాళులు..

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు ఉదయం నివాళులర్పించారు. 1984లో తన తల్లి, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మృతిచెందిన అనంతరం రాజీవ్‌ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచీ 1989 వరకు భారతదేశ ఆరో ప్రధానిగా కొనసాగారు. 1991లో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడుకు వెళ్లిన సందర్భంగా మే 21న ఎల్టీటీఈ ఉగ్రవాదులు జరిపిన దాడిలో రాజీవ్‌ కన్నుమూశారు.



 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని