రోడ్డు ప్రమాదంలో నటికి గాయాలు
close

తాజా వార్తలు

Published : 04/04/2020 21:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోడ్డు ప్రమాదంలో నటికి గాయాలు

బెంగళూరు: సినీ నటి షర్మిలా మాండ్రే రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆమె ముఖానికి, చేతికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. బెంగళూరులోని వసంత్‌ నగర్‌లో ఉన్న రైల్వే వంతెన వద్ద శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. షర్మిల తన స్నేహితుడు లోకేష్‌ వసంత్‌తో కలిసి ప్రయాణిస్తుండగా కారు స్తంభాన్ని ఢీకొట్టింది. షర్మిలతోపాటు అతడికి కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ మేరకు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన ఈ సమయంలో వీరు కారుతో బయటికి రావడానికి కారణం చెప్పలేదు. అయితే సరదాగా రైడ్‌కు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. షర్మిల, లోకేష్‌ చికిత్స తీసుకుంటున్నారు. అల్లరి నరేష్‌ నటించిన ‘కెవ్వుకేక’ (2013) సినిమాలో షర్మిల కథానాయిక పాత్ర పోషించారు. ఆమె అనేక కన్నడ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు కన్నడ సినిమాలు ఉన్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని