close

తాజా వార్తలు

Updated : 24/09/2020 11:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రామోజీ ఫిలింసిటీ సిగలో మరో ఆణిముత్యం 

ఆరోగ్య సంజీవినిగా ‘సుఖీభవ వెల్‌నెస్‌ సెంటర్‌’

అంతర్జాతీయ ప్రమాణాలతో అలరారుతున్న రామోజీ ఫిలింసిటీ సిగలో మరో ఆణిముత్యం.. సుఖీభవ  వెల్‌నెస్‌ సెంటర్‌. అలసిన మనసుకు, సొలసిన శరీరానికి స్వస్థతను కలిగించడం ఈ కేంద్రం ప్రత్యేకత. ప్రకృతి ఒడిలో ప్రాకృతిక ధర్మాలకు పెద్దపీట వేస్తూ పరిపూర్ణ ఆరోగ్యానికి కృషి చేసే ఈ వెల్‌నెస్‌ సెంటర్‌లో మందులన్న మాటే మనకు వినిపించదు. సహజ సిద్ధమైన ఆహార చికిత్సతో పాటు సంప్రదాయ విధానాలైన యోగా, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యాల సాయంతో శారీరక, మానసిక ఆరోగ్యం అందించడంలో ఇక్కడి నిపుణులది అందెవేసిన చేయి. ఆరోగ్య సంజీవని సుఖీభవ వెల్‌నెస్‌ సెంటర్‌  గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?

నీరు, నిప్పు, నింగి, నేల, వాయువు.. ప్రకృతిలోని పంచభూతాలివి. మన శరీరం కూడా ఈ పంచభూతాల సమ్మిళతమే. ఈ ఐదూ మన ఆరోగ్యాన్ని అనుక్షణం ప్రభావితం చేసేవే. మనం తినే ఆహారం, చేసే వ్యాయామం, తీసుకొనే ఒత్తిడి, పడుకొనే నిద్ర.. ఇలా మన జీవన శైలి కూడా ఆరోగ్యాన్ని నిర్దేశించేదే. ప్రకృతికి దూరంగా వెళ్లినా, జీవన శైలి గతి తప్పినా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఒకసారి ఆరోగ్యం చేజారితే దాన్ని తిరిగి చేజెక్కించుకోవడం కొంత కష్టసాధ్యమైన విషయమే. అందుకే మన పూర్వీకులు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు. ఆ మహద్భాగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. దానికోసం ప్రకృతి చెంత జీవించాలి.  పంచ భూతాల సహకారం తీసుకోవాలి. జీవన శైలిని చక్కగా మలచుకోవాలి. ఇలా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించేందుకు రామోజీ ఫిలింసిటీలో సుఖీభవ వెల్‌నెస్‌ సెంటర్‌ అందరికీ అందుబాటులో ఉంది. 

ఎలా డిజైన్‌ చేశారంటే..?
‘‘రామోజీ ఫిలిం సిటీలోని సుఖీభవ వెల్‌నెస్‌ సెంటర్‌ని అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్‌ చేశాం. ఈ వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రధాన ఉద్దేశం.. ఏదైనా సమస్య ఉంటే దాన్ని నయం చేయడం. రెండోది అసలు సమస్యే లేకుండా నివారించడం. వెల్‌నెస్‌ సెంటర్‌లో ప్రధానంగా ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, అంతర్జాతీయంగా కొన్ని సంప్రదాయ థెరపీల  సమ్మిళితంగా చికిత్స ఉంటుంది. వెల్‌నెస్‌ సెంటర్‌ అనగానే ఇదేదో స్పాలాంటిది కాదు. వ్యక్తి  తాలుకు శరీరతత్వాన్ని సమగ్రంగా అంచనా వేసి వారికి చికిత్స ప్లాన్‌ చేస్తాం. ప్రధానంగా ఇక్కడ నివారణ థెరపీలపై దృష్టి పెడుతున్నాం. చికిత్సలు కూడా ఉన్నాయి. ఈ వెల్‌నెస్‌ సెంటర్‌ను ఎలా డిజైన్‌ చేశామంటే.. బయటి ప్రాంతాల నుంచి చాలా మంది వస్తుంటారు. వారికి వసతి సౌకర్యం కూడా ఉంది. వారు ఇక్కడే ఉంటూ జీవన శైలిని ఎలా మలచుకోవాలో చెబుతాం. ఎందుకంటే.. ప్రస్తుతం జీవన శైలి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేవాళ్లకు వసతితో పాటు వారి ఆహారం, వ్యాయామం, నిద్ర మొత్తం జీవన శైలి ఎలా ఉండాలో రూపకల్పన చేస్తాం. ఈ ప్లానింగ్‌లో నివారణతో పాటు అవసరమైతే సంప్రదాయ, ప్రాకృతిక చికిత్సా మార్గాలను కూడా మేం అందజేస్తాం. ఇక్కడ మేం కల్పిస్తున్నసౌకర్యాల్లో ప్రీమియం, నార్మల్‌ అనే  లెవెల్స్‌ ఉన్నాయి. ఎవరికి సౌకర్యంగా ఉన్నవి వాళ్లు ఎంపికచేసుకోవచ్చు’’ - డాక్టర్‌ ఎం. అర్చన, డైరెక్టర్‌, సుఖీభవ వెల్‌నెస్‌ సెంటర్‌

ఏయే థెరఫీలు చేస్తారు?
ఒంట్లో పేరుకుపోయిన, తుప్పు పట్టిన అనారోగ్య మలినాలను తొలగించి బంగారంలాంటి ఆరోగ్యాన్ని అందించే పరుశవేది మన సొంతమైతే! నిస్సారమై నిస్థానంగా మారిన ప్రాణానికి కొత్త ఊపిరులూది సరికొత్త జవసత్వాలను అందించే సంజీవని ఏదైనా మన సొంతమైతేనో! అలాంటి పరుశవేది సంజీవని లాంటి ఆరోగ్య అస్త్రాలను సుఖీభవ వెల్‌నెస్‌ సెంటర్‌ అందిస్తోంది. ప్రకృతి సిద్ధమైన డైట్‌ థెరపీ, మడ్‌ థెరపీ, ఇన్ఫా్రెడ్‌ సోనా, సంప్రదాయ అభ్యంగనం, అరోమా థెరపీ, హైడ్రో థెరపీ, థాయ్‌ స్ట్రెచస్‌, ఆయుర్వేద చికిత్సలు.. మరెన్నో యోగ క్రియల సమ్మేళనంతో రామోజీ ఫిలింసిటీలో ఇప్పుడు సుఖీభవ వెల్‌నెస్‌ సెంటర్‌ అందరికీ అందుబాటులో ఉంది.

మనం ప్రకృతిలో అంతర్భాగం. నేడు మనమంతా ప్రకృతికి దూరమవుతున్నాం గనకే ఆరోగ్యానికి కూడా దూరమవుతున్నాం. ఈ నేపథ్యంలో నానారకాల మందులు, కోతలు, చికిత్సల అవసరం లేకుండా ప్రకృతి సిద్ధంగా సాంత్వన చేకూర్చడం, సంప్రదాయ పద్ధతుల్లో ఆరోగ్యామృత ధారల్ని అందరికీ పంచడమే సుఖీభవ వెల్‌నెస్‌ సెంటర్‌ ఉద్దేశ్యం.

చికిత్సకోసం సంప్రదించండి.. 

91211 52997, 91211 70840, 91541 18273, 08415 246699 ఫోన్‌ నంబర్లలో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల మధ్య సంప్రదించవచ్చు. లేదా info.sukhibhava@ramojifilmcity.com, www.sukhibhava.co.in ద్వారా కూడా సంప్రదించవచ్చు.



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.