close

తాజా వార్తలు

Updated : 18/09/2020 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధింపు

ఆర్డినెన్స్‌ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి: ఏపీలో పెట్రోలు, హైస్పీడ్‌ డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేరిట ఆర్డినెన్స్‌ విడుదలైంది. లీటర్‌పై రూపాయి చొప్పున సెస్‌ విధిస్తున్నట్లు పేర్కొంది. వ్యాట్‌కు అదనంగా ఈ రెండు ఉత్పత్తులపైనా సెస్‌ను వసూలు చేయనున్నారు. రహదారి అభివృద్ధి నిధి కోసం దీన్ని వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ సెస్‌ ద్వారా రూ.600కోట్ల మేర ఆదాయం వస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మొత్తాన్ని డీలర్‌ నుంచి వసూలు చేయాలని ఆర్డినెన్స్‌లో ప్రభుత్వం పేర్కొంది. ఆర్డినెన్స్‌ జారీ అనంతరం సెస్‌ పెంపుపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.