close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద తెదేపా నిరసన

రైతు సమస్యలపై సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద తెదేపా నిరసన చేపట్టింది. అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. పంటకు గిట్టుబాటు ధరతోపాటు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వరి కంకులు, పత్తి, మొక్కజొన్న పొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి మాదిరిగా మారిందని అన్నారు. రైతులు పండించిన పంటలు కొనే నాథులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దిగుబడి తగ్గినా ఎవరూ కొనట్లేదని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఉమ్మడి వరంగల్‌లో పర్యటిస్తున్న గవర్నర్‌

జిల్లాల పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. భూపాలపల్లిలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరిక్‌ మెడికల్‌షాప్‌ను ఆమె ప్రారంభించారు. అనంతరం స్థానిక పాఠశాలలో జాతీయ గీతాలాపనలో పాల్గొని విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అక్కడి నుంచి కటారం మండలం బోడగూడెం పర్యటనకు వెళ్లారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ ఛైర్‌పర్సన్‌ శ్రీహర్ష, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు గవర్నర్‌ను సాదరంగా ఆహ్వానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘దిశ’ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి నివేదిక

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యాచార ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్సీకి పోలీసులు నివేదిక అందించారు. దిశ అపహరణ, అత్యాచారం, మృతదేహం కాల్చివేతపై నివేదికలో వివరాలు పొందుపరిచారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌పై సిట్‌ బృందం విచారణ జరుపుతోంది. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ నేతృత్వంలో క్షేత్రస్థాయిలో సిట్‌ సభ్యుల బృందం దర్యాప్తు ప్రారంభించింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని సిట్‌ బృందం పరిశీలించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రేపు రాజ్యసభ ముందుకు పౌరసత్వ బిల్లు

ప్రతిపక్షాల విమర్శలు, నిరసనల నడుమ సోమవారం అర్ధరాత్రి లోక్‌సభలో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ బిల్లు.. బుధవారం పెద్దల సభ ముందుకు రానుంది. ఈ మేరకు రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. ఈ బిల్లుపై చర్చ కోసం ఎగువసభలో 6 గంటలు కేటాయించినట్లు తెలుస్తోంది. దిగువసభలో భాజపాకు అత్యధిక మెజార్టీ ఉన్నందున ఈ బిల్లు సులభంగానే ఆమోదం పొందింది. అయితే రాజ్యసభలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కన్పిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పౌరసత్వ బిల్లు ఎఫెక్ట్‌: ఈశాన్యంలో బంద్‌

పొరుగు దేశాల నుంచి వచ్చిన శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించే దిశగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలు మంగళవారం బంద్‌ చేపట్టాయి. ఉదయం 5 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11 గంటల పాటు ఈ బంద్‌ కొనసాగనుంది. దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. అసోంలోని గువాహటి యూనివర్శిటీ, దిబ్రుగఢ్‌ యూనివర్శిటీలో పరీక్షలను వాయిదా వేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘రెండు దేశాల సిద్ధాంతం సావర్కర్‌దే’

స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో రెండు దేశాల సిద్ధాంతాన్ని తొలుత ప్రాతిపాదించింది వినాయక్‌ దామోదర్‌ సావర్కరేనని కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ అన్నారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా పార్లమెంటులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని మతప్రాతిపదికన కాంగ్రెస్‌ పార్టీ విభజించిందని.. అందువల్లే ఇప్పుడు ఈ బిల్లు అవసరమైందంటూ హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీన్ని ఖండించిన తివారీ.. ప్రతిగా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. నాడా అంబాసిడర్‌గా సునీల్‌ శెట్టి

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి జాతీయ డోపింగ్‌ నిరోధక వ్యవస్థ (నాడా) ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది 150 మందికి పైగా అథ్లెట్లు డోపింగ్‌లో దొరికిపోయిన సంగతి తెలిసిందే. అందులో బాడీబిల్డర్లు 1/3 వంతు ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌కు ఎక్కువ సమయం లేకపోవడంతో క్రీడాకారులను స్వచ్ఛంగా ఉంచేందుకు సునీల్‌ శెట్టి ఇమేజ్‌ను ఉపయోగించుకోవాలని నాడా భావిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఒరాకిల్‌ బోర్డులోకి విశాల్‌ సిక్కా

ఇన్ఫోసిస్‌ మాజీ సీఈవో విశాల్‌ సిక్కా ఒరాకిల్‌ బోర్డ్‌లో డైరెక్టర్‌గా నామినేట్‌ అయ్యారు. ఆయన ఇప్పటికే కృత్రిమమేధ ఆధారంగా పనిచేసే వియనాయ్‌ అనే స్టార్టప్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. 52 ఏళ్ల విశాల్‌ సిక్కా ప్రపంచంలోనే అత్యుత్తమ కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌ నిపుణుల్లో ఒకరు. విశాల్‌ రాకతో ఒరాకిల్‌ వ్యాపార విలువ పెరగుతుందని కంపెనీ ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పౌరసత్వ బిల్లుపై పార్టీతో విభేదించిన ప్రశాంత్‌ కిశోర్‌

పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడంపై ఆ పార్టీ నేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.  బిల్లు మతపరమైన విభేదాలు సృష్టించేదిగా ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘మత ఆధారంగా వివక్ష చూపే పౌరసత్వ బిల్లుకు జేడీయూ మద్దతు పలకడం నిరాశకు గురి చేసింది. పార్టీ రాజ్యాంగంలో మొదటి పేజీలోనే మూడుసార్లు ఉన్న లౌకిక విధానాలు, పార్టీ నాయకత్వం నిర్దేశించిన గాంధేయవాద ఆదర్శాలకు ఈ బిల్లు విరుద్ధంగా ఉంది’’ అని ఆయన ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. గాడిదలు తమవేనంటూ ఇరువర్గాలు వాదన


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.