close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 09/07/2020 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. యూపీ గ్యాంగ్‌స్ట‌ర్ వికాస్ దూబే అరెస్ట్‌!

కాన్పూర్ 8మంది పోలీసులను కాల్చివేసిన ఘ‌ట‌న‌లో ప్ర‌ధాననిందితుడైన వికాస్ దూబే ఎట్ట‌కేల‌కు పోలీసుల‌కు చిక్కాడు. వారం రోజులుగా పోలీసుల‌కు చిక్క‌కుండా త‌ప్పించుకు తిరుగుతున్న వికాస్ దూబేను మ‌ధ్య‌ప్ర‌దేశ్ ఉజ్జ‌యిన్‌‌లోని ఓ గుడివ‌ద్ద నేటి ఉద‌యం అరెస్టు చేశారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో అత‌ని ఇద్ద‌రు ప్ర‌ధాన‌ అనుచ‌రులు ఎన్‌కౌంట‌ర్‌లో మ‌ర‌ణించిన స‌మ‌యంలోనే వికాస్ దూబేను అరెస్టు చేసిన‌ట్లు స‌మాచారం. ఉజ్జ‌యిన్‌‌లోని ఓ ఆల‌యంలో మాస్కుతో తిరుగుతున్న వికాస్ దూబేను అక్క‌డే ఉన్న ఓ వ్య‌క్తి గుర్తించి పోలీసులకు స‌మాచారం అందజేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రఘురామకృష్ణరాజుపై వైకాపా ఎమ్మెల్యే ఫిర్యాదు

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై  ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన సహచర ఎమ్మెల్యేలను అసభ్య పదజాలంతో కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని తెలిపారు.  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న జగనన్న ఇళ్ల పథకంలో స్థలాల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయని, కొనుగోళ్లలో కూడా గోల్‌మాల్‌ జరుగుతోందని గతంలో రఘురామ కృష్ణ రాజు సంచలన వ్యాఖ్యలు చేసిన  సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భార‌త్‌లో ఒక్క‌రోజే  25,000 కేసులు!

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లో కొత్త‌గా 24,879పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి. దేశంలో తొలిసారిగా ఒక్క‌రోజే దాదాపు 25వేల మార్కు దగ్గరకు చేరింది. దీంతో గురువారం నాటికి దేశంలో క‌రోనా బాధితుల సంఖ్య 7,67,296‌కు చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది. అంతేకాకుండా వైర‌స్ బాధితుల్లో నిన్న ఒక్క‌రోజే 487మంది మృత్య‌వాత‌ప‌డ్డారు. దీంతో దేశంలో కొవిడ్ మ‌ర‌ణాల సంఖ్య 21,129కి చేరింది. క‌రోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్ప‌టి వ‌రకు 4,76,378 మంది కోలుకోగా మ‌రో 2,69,789ల యాక్టివ్ కేసులు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కొవిడ్‌ రోగులకు ఇన్‌హీలర్‌..?

కరోనావైరస్‌ రోగులకు అత్యవసర చికిత్సలో వినియోగించే రెమిడెసివిర్‌ను సరికొత్త రూపంలో అందుబాటులోకి తెచ్చేందుకు గిలిద్‌ సైన్సెస్‌ ప్రయత్నాలను ప్రారంభించింది. ఇప్పటి వరకు రెమిడెసివిర్‌ను ఇంజెక్షన్‌ రూపంలో రోగుల ఇస్తున్నారు. తాజాగా ఈ యాంటీ వైరల్‌ ఔషధాన్ని ఇన్‌హీలర్‌ రూపంలో వినియోగించే అంశంపై సదరు సంస్థ పరీక్షలను మొదలుపెట్టింది.  ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా వెల్లడించింది. దీనికోసం 18-45ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 60 మందిని ఎంపిక చేసినట్లు పేర్కొంది. ఈ ప్రయోగం విజయవంతమై ఇన్‌హీలర్‌ అందుబాటులోకి వస్తే  రోగులు ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ధోనీ రిటైర్మెంట్‌పై మేనేజర్‌ స్పష్టత  

కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఐపీఎల్‌ నిర్వహణలో జాప్యం చోటు చేసుకొంది. ఇదిలా ఉండగా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యం ఈ ఐపీఎల్‌ పైనే ఆధారపడింది. మహీ ఆటకు దూరమై ఏడాది కావస్తోంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ భారత జట్టులో తన సత్తా చూపిస్తాడని అంతా ఆశించారు. కానీ, కరోనా దెబ్బతో ఐపీఎల్‌ వాయిదా పడటం, ఈ నేపథ్యంలోనే ధోనీ రిటైర్మెంట్‌పై వార్తలు రావడం అతని అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. కాగా, ఈ విషయంపై ధోనీ మేనేజర్‌ మిహిర్‌ దివాకర్‌ తాజాగా ఓ స్పష్టత ఇచ్చాడు. పీటీఐతో మాట్లాడిన అతను మహీకి ఇప్పుడప్పుడే రిటైర్మెంట్‌ ఆలోచనలు లేవన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జాదూ మళ్లీ వచ్చేస్తున్నాడు...

బాలీవుడ్‌ క్రేజీ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ నుంచి సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ‘క్రిష్’‌ స్వీక్వెల్స్‌లో నాలుగో సినిమా ‘క్రిష్‌ 4’ కోసం ఆశగా ఉన్నారు. 2003లో వచ్చిన ‘కోయి. మిల్‌ గయా’, తర్వాత 2006లో ‘క్రిష్’, 2013లో వచ్చిన ‘క్రిష్‌ 3’ భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో ‘క్రిష్‌ 4’ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో షూటింగ్‌ వాయిదా పడింది. ఈ క్రమంలో అభిమానులకు తీపి కబురు చెప్పింది చిత్రబృందం. ‘కోయి.. మిల్‌ గయా’లో సందడి చేసిన క్రిష్‌ స్నేహితుడు ‘జాదూ’ మరింత అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మార్కెట్‌లోకి మోటో జీ 5G స్మార్ట్‌ఫోన్‌

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలు విలవిలాడిపోతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. క్రయ విక్రయాలు జరగకపోవడంతో కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. మొన్నటి వరకు దేశాలన్నీ లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా చర్యలు తీసుకుంటూ జవసత్వాలను నింపే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ విపణిలోకి మోటో తన కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. motog 5g పేరుతో యూకే, యూరప్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. దీని ధర 349 యూరోలు (మన రూపాయల్లో దాదాపు 30వేలు). అయితే భారత్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనేది సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అద్దె అడిగాడని ఇంటి యజమానినే చంపేశాడు

అద్దె అడిగాడని ఇంటియజమానినే చంపేశాడు ఓ అద్దెదారు కొడుకు.ఈ ఘటన చెన్నైలోని కుండ్రటూరులో చోటు చేసుకుంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ధనరాజ్‌ అనే వ్యక్తి  గుణశేఖర్‌ (51) ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా గత నాలుగు నెలలుగా అద్దె చెల్లించలేకపోయాడు. దీంతో ధనరాజ్‌తో యజమాని గుణశేఖర్‌ గొడవపడ్డాడు. అద్దెకట్టాల్సిందేనని భీష్మించాడు. దీంతో ధనరాజ్‌ కుమారుడు అజిత్‌ కోపం పట్టలేకపోయాడు. అర్ధరాత్రి యజమాని ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేసి చంపేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ‘కరణ్‌ జోహార్‌ ఏడుస్తూనే ఉన్నాడు’

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ మృతిపట్ల అగ్ర నిర్మాత కరణ్‌ జోహార్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. కాగా ఈ విమర్శలతో కరణ్‌ తీవ్రంగా కలత చెందినట్లు అతడి సన్నిహితుడు వెల్లడించారు. బాలీవుడ్‌ హంగామాతో  కరణ్‌ మిత్రుడు మాట్లాడుతూ.. సుశాంత్‌ ఆత్మహత్య తరువాత ఎదుర్కొన్న విమర్శలతో కరణ్‌ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ‘కరణ్‌ తీవ్రంగా కలత చెందాడు.  సుశాంత్‌తో ఎలాంటి సంబంధంలేని అనన్య పాండేకు కూడా విమర్శలు తప్పలేదు. సుశాంత్‌ ఆత్మహత్యకు పరిహారంగా నువ్వు కూడా బలవన్మరణానికి పాల్పడాలంటూ సామాజిక మాధ్యమాల్లో నిందించారు’ అని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మహారాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం అసంతృప్తి

స్వరాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారిని గుర్తించడం రాష్ట్రాల బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వలస కూలీల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం కేసును సుమోటోగా తీసుకుని విచారించింది. వలస కూలీల సమస్యల పరిష్కారానికి జాతీయ విధానం రూపొందించాలని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ న్యాయస్థానాన్ని కోరారు. కరోనా నిర్వహణలో భాగంగా ఇప్పటికే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని సొలిసిటర్‌ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అయితే మహరాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం సుప్రీంకోర్టు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.