close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 02/06/2020 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. నిమ్మగడ్డ కేసులో కామినేని కేవియట్‌ పిటిషన్‌

నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహారంపై భాజపా నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ మార్పు వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో కామినేని కేవీయట్‌ పిటిషన్‌ వేశారు. రమేశ్‌ కుమార్‌ తొలగింపు వ్యవహారంలో కామినేని హైకోర్టులోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. భాజపా కేంద్ర నాయకత్వం అనుమతితోనే సుప్రీంకోర్టులో తాను కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్టు కామినేని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. హోం మంత్రి మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ తదితరులు అమరవీరులకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.  గన్‌ పార్క్‌ వద్ద కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో భేటీ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో మరో 115 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 12,613 మంది నమూనాలు పరీక్షించగా 115 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 33 ఉండగా.. రాష్ట్రంలో 82 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 3,791 కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కారణంగా గడచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 64. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తెలంగాణలో నియంత పాలన: ఉత్తమ్‌

గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉత్తమ్‌తో పాటు కాంగ్రెస్‌ నేతలు వి.హనుమంతరావు, పొన్నం ప్రభాకర్‌, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల 60ఏళ్ల కోరికను సోనియా గాంధీ, కాంగ్రెస్‌ పార్టీ నెరవేర్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాలు జరిగాయని చెప్పిన నాయకులు ఇప్పుడు నియంత పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు రావడం లేదని, తెలంగాణ వచ్చిన నాడు 12లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు 24 లక్షల నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. 24 గంటల్లో 8,171 కేసులు..204 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 8392 కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో కొత్తగా 8171 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 1,98,706 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 97,581 ఉండగా, 95,526 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో 204 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 5,598కి పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నిజాంపూర్‌లో కాంట్రాక్ట్‌ విద్యుత్‌ ఉద్యోగి సాహసం

7. జార్జ్‌ ఫ్లాయిడ్‌ది నరహత్యే..!

ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్ ఫ్లాయిడ్‌ (46) మృతికి నిరసనగా అగ్రరాజ్యంలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్న వేళ అధికారిక శవపరీక్ష నివేదిక విడుదలైంది. మెడపై తీవ్రమైన ఒత్తిడి వల్లే ఆయన మరణించాడని వైద్యులు తేల్చారు. జార్జ్‌ మరణించిన తీరును బట్టి దీన్ని నరహత్యగా పేర్కొనవచ్చని మెడికల్‌ ఎగ్జామినర్‌ అభిప్రాయపడ్డారు. మెడను బలంగా నొక్కిపెట్టడం వల్ల గుండె ఆగి జార్జ్‌ మరణించినట్లు స్పష్టం చేశారు. అప్పటికే ఆయన గుండె సంబంధిత, హైపర్‌టెన్షన్‌ వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. పైగా ఇటీవల ‘ఫెంటనిల్‌’ ఇన్‌టాక్సికేషన్‌, ‘మెథమ్‌ఫెటమైన్‌’ అనే డ్రగ్స్‌ కూడా తీసుకున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. పవన్‌ నాకు మామిడి పండ్లు పంపలేదు: అలీ

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఏటా తనకు ఆర్గానిక్‌ మామిడి పండ్లు పంపేవారని, ఈ ఏడాది ఇంకా పంపలేదని సినీ నటుడు అలీ అన్నారు. పవన్‌తో తనకున్న అనుబంధం గురించి తాజాగా ఓ టెలివిజన్‌ ఛానల్‌లో మాట్లాడారు. చిరంజీవి కుటుంబానికి తనంటే ఎంతో ఇష్టమని ఫంక్షన్‌ జరిగినా తనని పిలుస్తారని చెప్పుకొచ్చారు. ‘‘అన్నయ్య చిరంజీవి కోసం ఆయన ఇంటికి వెళ్లినప్పుడు పవన్‌కల్యాణ్‌ అక్కడ ఉండేవారు. అప్పటికి ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టలేదు. సరదాగా సినిమా కబుర్లు చెప్పుకొనే వాళ్లం’’ అని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సమాజంలో జాత్యహంకారానికి చోటు లేదు..

సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి చోటు లేదని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదేళ్ల వ్యాఖ్యానించారు. ఇతరుల భావాల్ని అర్థం చేసుకొని గౌరవించడం, పరస్పర అవగాహన కేవలం ప్రారంభం మాత్రమేనని.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. నల్లజాతి అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే, కంపెనీలోని నల్లజాతి, ఆఫ్రికన్‌ అమెరికన్ల స్వరాన్ని వినిపించేందుకు మైక్రోసాఫ్ట్‌ను వేదికగా నిలుపుతామని సంస్థ ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సింగరేణిలో ప్రమాదం: నలుగురి మృతి

సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ ఉపరితల గని-1లోని ఫేజ్‌-2లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓబీ బ్లాస్టింగ్‌ సమయంలో మిస్‌ ఫైర్‌ కావడంతో ప్రమాదం జరిగింది. ఈఘటనలో  ఉదయం షిఫ్టులో పనిచేస్తున్న నలుగురు ఒప్పంద కార్మికులు అక్కడి కక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ఇప్పటి వరకు మూడు మృత దేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు రాకేశ్‌ అంజయ్య, ప్రవీణ్‌, కుమార్‌ గా గుర్తించినట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.