close
Array ( ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. సీమకు నీటి కేటాయింపులపై చట్టబద్ధత కల్పించాలి

గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా కృష్ణాడెల్టాకు మళ్లించి అక్కడ మిగిలిన నీటిని రాయలసీమకు కేటాయించాలని కోరుతూ గ్రేటర్‌ రాయలసీమ నేతలు శనివారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. ఎంవీ మైసూరారెడ్డి, గంగుల ప్రతాప్‌రెడ్డి, ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీలు దినేశ్‌రెడ్డి, ఆంజనేయరెడ్డితో పాటు 16 మంది గ్రేటర్‌ రాయలసీమ నేతలు సీఎంకు లేఖ రాసిన వారిలో ఉన్నారు. రాయలసీమకు గోదావరి జలాలు తీసుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటన చేయడం అభినందనీయమన్న సీమ నేతలు.. ఈ ప్రకటనపై సీఎం జగన్‌ చొరవ తీసుకుని గ్రేటర్‌ రాయలసీమ ప్రాజెక్టులైన హంద్రీనావా, గాలేరు-నగరి, వెలుగొండ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేస్తూ చట్టబద్ధత కల్పించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రాత్రిపూట నదీమార్గంలో వలసజీవులు!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటిపూట ఎండను భరించలేక, ఇతర కారణాల వల్ల వలస కార్మికులు రాత్రి సమయంలో నదులను దాటుతూ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. హరియాణా నుంచి బిహార్‌లోని తమ సొంత గ్రామాలకు కాలినడకన వెళ్లేందుకు... సుమారు రెండువేల మందికి పైగా యమునా నదిని దాటినట్లు సమాచారం. వీరు మొదట ఉత్తర్‌ ప్రదేశ్‌లోని షహరన్‌పూర్‌కు, అక్కడినుంచి బిహార్‌ వెళ్లేందుకు కాలిమార్గంలో ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో యమునా నదిని దాటి సొంతూళ్లకు వెళ్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో మరో 47 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ రోజురోజుకీ పెరిగిపోతోంది. గడిచిన 24గంటల్లో  9136 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 47 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్టు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2561కి చేరింది. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

4. స్నాతకోత్సవంలో రోబోలకు పట్టాలు

5. హెచ్‌-1బీ జారీలో వారికే తొలి ప్రాధాన్యం..!

హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసా జారీ విధానంలో కీలక సంస్కరణలు ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టారు. అమెరికాలో చదివిన విదేశీ నిపుణులకు తొలి ప్రాధాన్యం లభించేలా చూడడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. అలాగే, అమెరికా పౌరుల ఉపాధి కాపాడడం కూడా ఓ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ మేరకు రెండు పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం శుక్రవారం ‘ది హెచ్‌-1బీ అండ్‌ ఎల్‌-1 వీసా రిఫార్మ్‌ యాక్ట్‌’ పేరిట చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పోలీస్‌ స్టేషన్‌ ఎదుట తెదేపా నేతల ధర్నా

కృష్ణా జిల్లా ఉయ్యూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారనే  ఆరోపణపై తెదేపా కార్యకర్త రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైకాపా నేతల ఒత్తిడి మేరకు పోలీసులు తెదేపా శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపిస్తూ పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్‌ తెదేపా శ్రేణులతో కలిసి శనివారం ఉదయం ఉయ్యూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా కేసుల్లో రష్యాను దాటేసిన బ్రెజిల్‌

గతనెల అమెరికాపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా వైరస్‌ ఇప్పుడు లాటిన్‌ అమెరికాలోని బ్రెజిల్‌పై తన ప్రతాపం చూపుతోంది. గత నాలుగు రోజులుగా అక్కడ రోజుకు వెయ్యి మందికిపైగా మరిణిస్తున్నారు. దీంతో శుక్రవారం నాటికి మొత్తం మృతుల సంఖ్య 21 వేలు దాటిందని వైద్యాధికారులు వెల్లడించారు. మరోవైపు కేసుల సంఖ్య కూడా 3,30,890కు చేరిందన్నారు. దీంతో అత్యధిక కరోనా కేసుల జాబితాలో బ్రెజిల్‌.. రష్యాను దాటి రెండో స్థానానికి చేరింది. గడిచిన 24 గంటల్లో అక్కడ 1001 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. టీమ్‌ఇండియా పర్యటనపై ఆస్ట్రేలియా ఆశలు..

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ ఏడాది చివర్లో టీమ్‌ఇండియా.. ఆస్ట్రేలియా పర్యటనకు వస్తుందని ఆ బోర్డు సీఈవో కెవిన్‌ రాబర్ట్స్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రస్తుతం క్రికెట్‌ కార్యకలాపాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే ఏడాది చివర్లో భారత్‌తో నిర్వహించాల్సిన టెస్టు సిరీస్‌ ఆసీస్‌ బోర్డుకు కీలకంగా మారింది. ఇక తాజాగా, కెవిన్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ భారత పర్యటనపై స్పందించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏదీ కచ్చితంగా జరుగుతుందని చెప్పలేమని.. అయితే దాదాపు భారత్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎనిమిది కోట్ల మంది చిన్నారులు ప్రమాదంలోకి..

చిన్నారుల్లో ప్రాణాంతక వ్యాధులను ముందుగానే నివారించి, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ప్రపంచ దేశాలు కొనసాగిస్తున్న టీకా కార్యక్రమాన్ని కొవిడ్ 19 మహమ్మారి దెబ్బతీస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, గవి అండ్ సబిన్‌ వ్యాక్సిన్‌ ఇనిస్టిట్యూట్ తెలిపాయి. టీకాలకు దూరం కావడం సంవత్సరం లోపు చిన్నారులపై ఎక్కువ ప్రభావం చూపుతుందని, ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల మంది చిన్నారుల జీవితాలకు ప్రమాదంగా పరిణమించిందని ఆందోళన వ్యక్తం చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
10. థియేటర్‌లోనే అనుష్క సినిమా..!

అగ్రకథానాయిక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్దం’ సినిమా విడుదలపై నిర్మాత స్పష్టత ఇచ్చారు. చిత్రాన్ని థియేటర్‌లోనే విడుదల చేస్తామని చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా థియేటర్లు మూతపడడంతో పలు తమిళ, హిందీ సినిమాలను ఓటీటీల్లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓటీటీ వేదికగా ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారంటూ వార్తలు వస్తోన్నాయి. ఈ నేపథ్యంలో కోన వెంకట్‌ రూమర్స్‌పై స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.