close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120047190 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => IqmJywo5xPQ [video_short_link] => IqmJywo5xPQ [created_by] => 8924902 [created_date] => 2020-04-08 12:46:30.398358 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. జర్నలిస్ట్‌ మృతికి ప్రధాని సంతాపం!

కరోనా మహమ్మారి బారినపడి ప్రముఖ జర్నలిస్ట్‌ కంచిభొట్ల బ్రహ్మానందం మృతిచెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. కొవిడ్‌ కారణంగా బ్రహ్మానందం మరణించడం ఎంతో కలచివేసిందని ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు. జర్నలిజంలో కంచిభొట్ల చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కంచిభొట్ల బ్రహ్మం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పర్చూరు వాసి. రాష్ట్రంలో ఓ ఆంగ్లపత్రిక పాత్రికేయునిగా జీవితం ప్రారంభించిన ఆయన..తరువాత పలు పత్రికల్లో పనిచేశారు. ఆంగ్ల వార్తా సంస్థ యూఎన్‌ఐలోనూ పనిచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బాలిలో చిక్కుకున్న 80 మంది భారతీయులు

లాక్‌డౌన్‌ కారణంగా 80 మంది భారతీయులు ఇండోనేషియాలోని బాలిలో చిక్కుకున్నారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు, విజయవాడకు చెందిన ఐదుగురు, ఇద్దరు తిరుపతి వాసులు ఉన్నట్లు సమాచారం. మార్చి 10న విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌ వాసులు మార్చి 17న తిరిగిరావాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించడంతో బాలిలోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం బాలిలోని హోటల్‌లో ఆశ్రయం పొందుతున్నారు. డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో 329కి చేరిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కరోనా  కేసుల సంఖ్య 329కి చేరింది. ఇవాళ కొత్తగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి మొదలైందని, అది ప్రాథమిక స్థాయిలో ఉందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కరీంనగర్‌లో మరో రెండు హెల్ప్‌లైన్లు

కరోనా నేపథ్యంలో వైరస్‌ నియంత్రణ, ప్రజల మానసిక ఆరోగ్యం కోసం మరో రెండు హెల్ప్‌లైన్‌ నంబర్లు  ఏర్పాటు చేసినట్లు  జిల్లా కలెక్టర్‌ శశాంక తెలిపారు. వీడియోకాల్‌ లేదా వాట్సాప్‌ ద్వారా వైద్య సహాయం పొందవచ్చని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్ప్‌లైన్లు పనిచేస్తాయని వెల్లడించారు.  వైద్య సహాయం, సలహాలకు కొవిడ్‌ టెలీ మెడిసిన్‌ హెల్ప్‌లైన్‌ 83318 65100కు సంప్రదించాలన్నారు. దురలవాట్లు, మానసిక రుగ్మతలకు గురైన వారికి కౌన్సెలింగ్‌ ఇవ్వనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌లో కరోనా: 149 మరణాలు, 5194 కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోంది. బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5194కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరణాల సంఖ్య 149కి చేరింది. మరో 4643మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో 402మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో 70మంది విదేశీయులే ఉన్నారు. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. లైవ్‌ బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

6. లాక్‌డౌన్‌ వేళ.. వికసించిన మత సామరస్యం

అరవై ఐదేళ్ల హిందూ వృద్ధురాలి అంత్యక్రియల్లో ముస్లిం యువకులు సాయం చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో శ్మశానవాటికకి ఆమె మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి వాహనం లేకపోవడం, కరోనా భయంతో బంధువులు కూడా రాకపోవడంతో.. ఇంటి సమీపంలో ఉండే ముస్లిం యువకులే సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆ వృద్ధురాలు సోమవారం మరణించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వుహాన్‌లో లాక్‌డౌన్‌ ఎత్తివేత

కరోనా వైరస్‌కు కేంద్ర బిందువైన వుహాన్‌లో పరిస్థితులు కుదుట పడ్డాయి. కరోనా పాజిటివ్‌ కేసులు పూర్తిగా నియంత్రణలోకి రావడంతో అక్కడ లాక్‌డౌన్‌ ఎత్తివేసినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ మొదట వ్యాపించింది.. కోటి 60 లక్షల జనాభా ఉండే వుహాన్ నగరంలోనే. జనవరి 23న చైనా ప్రభుత్వం అక్కడ లాక్‌డౌన్‌ విధించింది. ఆ తర్వాత హుబే ప్రావిన్స్ మొత్తాన్నీ నిర్బంధంలో ఉంచింది. ఎట్టకేలకు 76 రోజుల తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేశారు. ఇప్పుడు వుహాన్ ప్రజలు ఇక స్వేచ్ఛగా తిరిగేయొచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. జట్టు నుంచి తప్పించాలని ఎలా అంటారు?

కొన్ని మ్యాచ్‌ల్లో సరిగ్గా రాణించకపోతే ఆటగాళ్లను జట్టులో నుంచి తప్పించాలనే అభిప్రాయానికి ఎలా వస్తారని టీమ్‌ఇండియా వైస్‌కెప్టెన్ రోహిత్‌ శర్మ అభిమానులను ప్రశ్నించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌తో హిట్‌మ్యాన్‌ ముచ్చటించాడు. ‘‘ఆ ఆటగాడు గొప్పగా రాణించట్లేదు.. అతడిని జట్టు నుంచి తప్పించండి అని కొందరు అంటుంటారు. కానీ మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. ప్రత్యర్థి జట్టు కూడా విజయం కోసమే పోరాడుతుంది’’ అని అభిమానులను ఉద్దేశించి హిట్‌మ్యాన్‌ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అందుకే ఏప్రిల్‌ 8వ తేదీ చిరంజీవికి స్పెషల్‌

రీఎంట్రీ తర్వాత చిరంజీవి సినిమాల జోరు పెంచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’లో నటిస్తున్నారు. కాగా, ఇటీవల సోషల్‌మీడియాలోకి వచ్చిన చిరు సూపర్‌ యాక్టివ్‌గా ఉంటున్నారు. ప్రతి విషయంపైనా స్పందిస్తూ, తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా ఏప్రిల్‌ 8వ తేదీతో తనకెంతో అనుబంధం ఉందని నేడు ఆ విశేషాలను చెబుతానని చిరు ట్విటర్‌ వేదికగా అన్నారు. చెప్పినట్లుగానే, వరస ట్వీట్లతో ఏప్రిల్‌ 8తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. లాక్‌డౌన్‌ వేళ బంధువులు లేకుండానే ఒక్కటైన జంట



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.