close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120028853 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => 0gB_h8uN9V8 [video_short_link] => 0gB_h8uN9V8 [created_by] => [created_date] => [modified_by] => 8925086 [modified_date] => 2020-02-29 13:08:48.61682 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. విశాఖ ఘటనపై గవర్నర్‌కు తెదేపా ఫిర్యాదు

విశాఖలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై తెదేపా ప్రతినిధుల బృందం గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మాట్లాడుతూ...విశాఖపై జగన్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ‘‘గతంలో విజయమ్మను ఎంపీగా ఓడించారని జగన్‌కు కక్ష. చంద్రబాబు పర్యటనకు అనుమతిచ్చిన పోలీసులే అడ్డుకోవడమేంటి?. ప్రశాంతంగా ఉన్న విశాఖలో అలజడి రేపుతున్నారు. పులివెందుల రాజకీయాలను విశాఖలో తీసుకొస్తున్నారు. పోలీసుల నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజాస్వామ్యాన్నికాపాడాలి’’ అని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చిరంజీవి నివాసం వద్ద పోలీసు బందోబస్తు

జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.  చిరంజీవి నివాసం ముట్టడికి అమరావతి ఐకాస నేతలు వస్తున్నారన్న సమాచారంతో ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అయితే, చిరంజీవి నివాసం ముట్టడికి తాము పిలుపు ఇవ్వలేదని, కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని అమరావతి ఐకాస నేతలు స్పష్టం చేశారు. ఈ ప్రచారానికి ఐకాసకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అసత్య ప్రచారం చేస్తున్న అల్లరి మూకలపై చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల పోలీసులకు ఐకాస నేతలు విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జగన్‌ క్రూరత్వం బయటపడింది: యనమల

ప్రజలే చంద్రబాబుపై కోడిగుడ్లు, టమాటాలు విసిరారని వైకాపా నేతలు విశాఖ వాసులను అవమానిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ వాసులు వైకాపా నేతలు మాదిరి ప్రవర్తించే క్రూరులు కారని అన్నారు. శాంతికి నిదర్శనంగా నిలిచే విశాఖ ప్రజలను వైకాపా నేతలు రౌడీలు, సంఘ విద్రోహులతో పోల్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయిజం ప్రేరేపిస్తూ విశాఖ అభివృద్ధితో పాటు రాష్ట్రాభివృద్ధిని వైకాపా అడ్డుకుంటోందని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కేంద్ర మంత్రిగారింట్లోనే ‘మంచి’నీరు లేదట!

గ్రామాల్లో, మురికివాడల్లో తరచూ నీటికాలుష్య సమస్య గురించి విని ఉంటాం. కానీ, ఏకంగా కేంద్ర మంత్రి ఇంట్లోనే మంచినీరు ప్రమాణాలకు అనుగుణంగా లేదట. ఈ విషయం స్వయంగా బ్యూరో ఆఫ్‌ ఇండియన్ స్టాండర్డ్‌ (బీఐఎస్‌) సుప్రీంకోర్టుకు నివేదించింది. మొత్తం దిల్లీ వ్యాప్తంగా 11 నమూనాలను సేకరించిన బీఐఎస్‌.. కేంద్రమంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌ అధికారిక నివాసంలోనూ నీటిని పరీక్షించింది. సంస్థ నిర్దేశించిన మొత్తం 47 ప్రమాణాల ఆధారంగా నీటిని పరీక్షించగా అల్యూమినియం, కోలిఫాం స్థాయిలు ప్రమాణాల ప్రకారం లేవని గుర్తించినట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో బీఐఎస్‌ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆ దేశంలో ప్రజా రవాణా ఫ్రీ.. ఫ్రీ

ఐరోపా ఖండంలోని అతిచిన్న దేశమైన లగ్జెంబర్గ్‌.. వాయు కాలుష్యం, ట్రాఫిక్‌ జామ్‌లను అరికట్టేందుకు పెద్ద నిర్ణయం తీసుకుంది. ప్రజలందరికీ ఉచిత రవాణా సౌకర్యం అందించాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 29 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ఆ దేశ రవాణా మంత్రి వెల్లడించారు. ప్రపంచంలోనే ఇలాంటి సౌకర్యం కల్పిస్తున్న తొలి దేశం లగ్జెంబర్గే కావడం విశేషం. ఈ నిర్ణయం వల్ల ప్రతి వ్యక్తికి ఏటా దాదాపు 100 యూరోలు ఆదా అవుతుందట. అయితే ఈ ఉచిత ప్రజా రవాణా వ్యవస్థలో కొన్ని సేవలను మినహాయించారు. రైళ్లలో ఫస్ట్‌ క్లాస్‌ ప్రయాణం, రాత్రి వేళల్లో బస్సు సర్వీసులకు ఈ ‘ఉచితం’ వర్తించదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ట్రెండింగ్‌లో పవన్‌ ఫస్ట్‌లుక్‌

పవన్‌కల్యాణ్‌ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో చిత్ర సంగీత దర్శకుడు తమన్‌.. ‘PSPK26FirstSingle’ను త్వరలోనే విడుదల చేస్తామని ఇటీవల ప్రకటించారు. మార్చి 2 పవన్‌ సినిమా ఫస్ట్‌లుక్‌, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8న ఫస్ట్‌సాంగ్‌ను విడుదల చేయనున్నారంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. దీంతో ప్రస్తుతం #PSPK26FirstLook అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. మరోవైపు ఈ సినిమాకి ‘వకీల్‌సాబ్‌’ అనే పేరు ప్రచారంలో ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రాధా మాయాజలం.. షెఫాలీ మెరుపులు

షెఫాలీ వర్మ (47, 34 బంతుల్లో; 7×4, 1×6) బ్యాటుతో, రాధా యాదవ్‌ (4/23) బంతితో సత్తా చాటడంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన మరో ఘన విజయం సాధించింది. శనివారం మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో లంకపై ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. లంక సారథి ఆటపట్టు (33, 24 బంతుల్లో; 5×4, 1×6), దిల్షారి (25*, 16 బంతుల్లో; 2×4) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ 14 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మరో రూ. 8వేల కోట్లు కట్టిన ఎయిర్‌టెల్‌

సుప్రీంకోర్టు ఆగ్రహంతో బకాయిల చెల్లింపులను వేగవంతం చేస్తున్నాయి టెలికాం సంస్థలు. ఇప్పటికే రూ. 10వేల కోట్లు చెల్లించిన ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ నేడు మరో రూ. 8,004కోట్లను కట్టింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. ఈ కంపెనీ లైసెన్సు ఫీజు, స్పెక్ట్రమ్‌ వినియోగ ఛార్జీల కింద మొత్తం రూ.35,586కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. బకాయిల చెల్లింపుల విషయంలో టెలికాం కంపెనీలకు ఉపశమనం కల్పించే అంశంపై జరిగిన డిజిటల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌(డీసీసీ) కీలక సమావేశం శుక్రవారం అర్ధంతరంగా ముగిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పాక్‌లో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి

పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న రైలును బస్సు ఢీకొట్టిన ఘటనలో కనీసం 20 మంది మృతిచెందారు. మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. సింధ్‌ ప్రావిన్సులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రావల్పిండి నుంచి కరాచీ వెళుతున్న రైలును ఓ క్రాసింగ్‌ వద్ద బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కొంతమంది పిల్లలు సహా కనీసం 20 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఇవి చెవి రింగులే కాదు.. పేలే తూటాలు కూడా..



Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.