close

తాజా వార్తలు

Updated : 23/01/2020 13:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. మూడు రాజధానుల వ్యూహానికి జగన్‌ పదును

పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఆమోదానికి శాసనమండలిలో ఎదురుదెబ్బ తగలడంతో భవిష్యత్తు కార్యాచరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఎట్టి పరిస్ధితుల్లోనూ రాష్ట్రంలో 3 రాజధానులు పెట్టాలని పట్టుదలగా ముందుకు వెళ్లిన ప్రభుత్వానికి శాసన మండలి నిర్ణయం శరాఘాతంగా మారింది. దీనిపై ఏం చేద్దామనే విషయమై పార్టీ ముఖ్యనేతలు, న్యాయ నిపుణులతో సీఎం జగన్ మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ, ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం, పార్టీ ముఖ్య నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రైతుల ఆందోళన మరింత ఉద్ధృతం

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ అక్కడి చుట్టుపక్కల గ్రామాల్లో చేపట్టిన ఆందోళనలు 37వ రోజుకు చేరాయి.మందడం, తుళ్లూరు, వెలగపూడి, కృష్ణాయపాలెం రైతుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర గ్రామాల్లోనూ నిరసనలు చేపట్టారు. ప్రధాని నరేంద్రమోదీ రాజధానికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో మహిళలు పూజలు నిర్వహిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మంత్రులు షరీఫ్‌పై దాడి చేశారు: చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎమ్మెల్సీలు నిన్న మండలిలో అసాధారణంగా పోరాడి ధర్మాన్ని కాపాడారని  అభినందించారు. ‘‘ రాష్ట్ర భవిష్యత్తు కాపాడి.. ప్రజాస్వామ్యాన్ని బతికించారు. అనుభవజ్ఞుడి అండ ఎంత అవసరమో యనమల నిరూపించారు. యనమల అనుభవం, పరిజ్ఞానంతో ప్రజాస్వామ్యానికి జీవం పోశారు. తెదేపా యువ ఎమ్మెల్సీలు ధైర్యం, తెగువ ప్రశంసనీయం. వైకాపా మంత్రులు కౌన్సిల్ ఛైర్మన్‌ షరీఫ్ పై దాడి చేశారు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రైతులకు మద్దతుగా లాంగ్‌ మార్చ్‌: పవన్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, రాష్ట్ర భాజపా నేతలు గురువారం ఉదయం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఈ సందర్భంగా పవన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో ఇరుపార్టీల కార్యాచరణపై పవన్‌ ..నడ్డాకు వివరించారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ... మూడు రాజధానుల అంశాన్ని ప్రధాని, హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లామని వైకాపా నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. రైతులకు మద్దతుగా, ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్‌ కోసం లాంగ్‌ మార్చ్‌ నిర్వహించబోతున్నామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కావాలంటే ఆయన జేడీయూ నుంచి వెళ్లిపోవచ్చు

భాజపాతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారంటూ ఇటీవల జేడీయూ జనరల్‌ సెక్రటరీ పవన్‌ వర్మ బహిరంగ లేఖ రాయడంపై బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ తీవ్రంగా స్పందించారు. పవన్‌ తన అసంతృప్తిని వ్యక్తం చేసే మార్గం ఇది కాదన్నారు. ఆయన కావాలంటే పార్టీ వీడి వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. ‘ఎవరికైనా సమస్యలు ఉంటే దాని గురించి పార్టీ సమావేశాల్లో మాట్లాడాలి. అంతే కానీ, ఇలా బహిరంగంగా మాట్లాడకూడదు. ఆయన ఇలా ప్రకటన చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన కావాలంటే పార్టీ నుంచి వెళ్లిపోయి.. తనకు నచ్చిన మరో పార్టీలో చేరవచ్చు. అది అతని నిర్ణయం. అతనికి నా ఆశీర్వాదం ఉంటుంది’ అని నితీశ్‌ స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కరోనా ఎఫెక్ట్‌: ఉహాన్‌లో ప్రజారవాణా నిలిపివేత

చైనాలో కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్‌ అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 571 కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ మనిషి నుంచి మరో మనిషికి కూడా సోకుతుందని ధ్రువపడటంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ వైరస్‌ మొట్టమొదటగా బయటపడిన ఉహాన్‌ నగరంలో ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేశారు. ఇక్కడి ప్రజలు నగరం నుంచి బయటకు వెళ్లకుండా, బయటి వ్యక్తులు నగరంలోకి రాకుండా విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. అజహరుద్దీన్‌ చీటింగ్‌ కేసుపై వివరణ

టీమిండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌పై ఔరంగాబాద్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒక ట్రావెల్‌ ఏజెంట్‌ను మోసం చేశారనే ఆరోపణలపై అజహరుద్దీన్‌తో సహా మరో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఔరంగాబాద్‌కు చెందిన షాహబ్‌ మొహమ్మద్‌ అనే ట్రావెల్‌ ఏజెంట్‌.. మజీబ్‌ఖాన్‌, సుధీష్‌ అవిక్కల్‌, మహమ్మద్‌ అజహరుద్దీన్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని స్థానిక పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఇదిలా ఉండగా అజహరుద్దీన్‌ గతరాత్రి ఈ ఫిర్యాదుపై స్పందించాడు. తన ట్విటర్‌లో ఒక వీడియో పోస్టు చేస్తూ.. అందులో తానేమీ మోసం చేయలేదని, ఇదంతా తప్పుడు ఆరోపణలని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. శుభ్‌మన్‌ను ఎప్పుడు కెప్టెన్‌ చేస్తున్నారు?

#AskSrk పేరిట అభిమానులతో ముచ్చటించిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యజమాని షారుఖ్‌ ఖాన్‌ ఓ నెటిజన్‌కు అదిరిపోయే సమాధానమిచ్చాడు. ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్న యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌గిల్‌ను కేకేఆర్‌ ఎప్పుడు కెప్టెన్‌ చేస్తుందని ఒక ట్విటర్‌ యూజర్‌ షారుఖ్‌ను అడిగాడు. దీనికి స్పందించిన ఆయన.. ‘కోల్‌కతా జట్టు నిన్ను హెడ్‌కోచ్‌ చేసిన వెంటనే’ అని బదులిచ్చాడు. ఖాన్‌ ట్వీట్‌ చూసిన కేకేఆర్‌ జట్టు తన అధికారిక ట్విటర్‌లో ఆ జట్టు హెడ్‌కోచ్‌, న్యూజిలాండ్‌ మాజీ సారథి బ్రెండన్‌ మెక్‌కలమ్‌ను ట్యాగ్‌ చేస్తూ #savagereplies అని పేర్కొంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేసి మరో ట్వీట్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మరోసారి జంటగా మహేశ్‌-కియారా..?

‘భరత్‌ అనే నేను’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బాలీవుడ్‌ చిన్నది కియారా అడ్వాణీ. ఈ సినిమాలో మహేశ్‌ సరసన ‘వసుమతి’గా నటించి కియారా ప్రేక్షకులను మెప్పించారు. దీంతో ఈ జంట మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇటీవల విడుదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న మహేశ్ తన తదుపరి చిత్రం వంశీ పైడిపల్లితో చేయనున్నారంటూ టాలీవుడ్‌లో టాక్‌. ఈ సినిమాలో మహేశ్‌కు జంటగా కియారా అడ్వాణీ అయితే బాగుంటుందని నమ్రత దర్శకుడికి సూచించారట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రాజస్థాన్: పులులను వెంటాడిన ఎలుగుబంటి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.