close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 1 PM

1. ఏపీని తాకిన పౌరసత్వ చట్టం ప్రకంపనలు

పౌరసత్వ సవరణ చట్టం ప్రకంపనలు ఏపీని తాకాయి. ఈ నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలు, బంగాల్‌లో చెలరేగుతున్న అల్లర్లతో ఉత్తరాది నుంచి రాష్ట్రానికి రావాల్సిన రైళ్లు రద్దయ్యాయి. ఇటు నుంచి వెళ్లాల్సిన రైళ్లను కూడా అధికారులు నిలిపివేయడం వల్ల విశాఖ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు అందోళనకు దిగారు. ఫలక్‌నుమా, కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లను నిలిపివేస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. దీంతో ముందుగా టికెట్లు తీసుకున్న తమను గమ్యస్థానాలకు చేర్చాలని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. సీఎం సర్‌.. మా నాన్నకు జీతం పెంచండి!

మా నాన్నకు జీతం పెంచండి అంటూ ఓ ఆరేళ్ల చిన్నారి ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రికే లేఖ రాసింది. తక్కువ జీతం కారణంగా తన తండ్రి ఎక్కువ సమయం విధుల్లో ఉంటూ తనతో గడపడం లేదంటూ లేఖలో పేర్కొంది. మహారాష్ట్రలోని జల్నా ప్రాంతానికి చెందిన శ్రియా హరాలే అనే ఆరేళ్ల చిన్నారి స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఆ అమ్మాయి తండ్రి అంబాద్‌ డిపోలో బస్‌ కండక్టర్‌గా పనిచేస్తున్నారు. అయితే తక్కువ జీతం ఉండటంతో డబ్బుల కోసం ఎక్కువ సమయం విధుల్లోనే ఉంటున్నాడు. తండ్రితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని ఆ చిన్నారి సీఎంకు లేఖ రాసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బడ్జెట్‌పై నిర్మలా సీతారామన్ కసరత్తు

కేంద్ర బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కసరత్తు ప్రారంభించారు. బడ్జెట్‌ తయారీకి ముందు వివిధ వర్గాలు, సంఘాలు, ఆర్థికవేత్తలతో సోమవారం నుంచి సంప్రదింపులు జరపనున్నారు. అంకుర, ఫిన్ టెక్, డిజిటల్ రంగాల ప్రతినిధులతో మంత్రి చర్చించనున్నారు. రేపు సాయంత్రం ఫైనాన్సిల్ రంగం, కాపిటల్ మార్కెట్ ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశముంది. జనవరి 25 లోపు సంప్రదింపుల ప్రక్రియ ముగించి,  ఫిబ్రవరి 1న పార్లమెంటులో నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. దుస్తులు కొంటే ఉల్లిపాయలు ఉచితం!

దేశవ్యాప్తంగా ఆకాశాన్నంటిన ఉల్లి ధరలను పలువురు తమ వ్యాపారాలకు అనుకూలంగా మార్చుకుంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. అందుకు మహారాష్ట్రలోని థానేకు చెందిన ఓ వస్త్ర దుకాణమే ఉదాహరణ. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిపాయలకు ఉన్న డిమాండును అర్థం చేసుకున్న ఆ దుకాణ యజమాని, వినియోగదారులకు ఆకర్షించేందుకు వస్త్రాల కొనుగోలుపై ఉచిత ఉల్లిపాయల ఆఫర్‌ ప్రకటించాడు. దీంతో ఈ ఆఫర్‌ స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించిన భాజపా కూటమి పార్టీ

అసోంలో భాజపాకు తమ కూటమి పార్టీ నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రంలో భాజపా కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అసోం గణ పరిషత్‌(ఏజీపీ) పౌరసత్వ చట్ట సవరణపై వ్యతిరేకత వ్యక్తం చేసింది. దీనిపై ఆ పార్టీ మొదట మద్దతు ఇచ్చినప్పటికీ మళ్లీ ఇప్పుడు యూటర్న్‌ తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు శనివారం జరిగిన పార్టీ సీనియర్‌ నాయకుల సమావేశంలో నిర్ణయించింది. అదేవిధంగా ఈ విషయమై ఆ పార్టీ నేతలు ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కలిసేందుకు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. అంపైర్‌కు గాయం: నొప్పితో విలవిల

ఆస్ట్రేలియా×న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న డే/నైట్‌ టెస్టులో ఆటగాళ్లు వరుసగా గాయాల పాలవుతున్నారు. తొలి రోజు కివీస్‌ ఆటగాడు లాకీ ఫెర్గూసన్‌, రెండో రోజు హేజిల్‌వుడ్‌ గాయపడ్డాడు. మూడో రోజు అనూహ్యంగా ఫీల్డ్‌ అంపైర్‌ అలీమ్‌కు గాయమైంది. కివీస్‌ ఆటగాడు శాంట్నర్‌ ఢీ కొట్టడంతో మైదానంలో అంపైర్ నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే న్యూజిలాండ్‌ ఫిజియో వచ్చి అతడికి చికిత్స చేశాడు. అనంతరం అలీమ్‌ అంపైరింగ్‌ను కొనసాగించాడు. గాయపడినా మైదానాన్ని వీడకుండా తన పనిని కొనసాగించడంతో స్టేడియంలో ప్రేక్షకులు చప్పట్లతో ప్రశంసించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వెనిషియన్‌ గాజు తయారీ పట్ల యువత ఆసక్తి 

8. కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్‌ పోటీ!

భారత సారథి విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డుకు అతి చేరువలో ఉన్నాడు. ఈ ఏడాదిలో కూడా వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిస్తే.. అత్యధిక సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు.  అంతేకాదు మూడు సంవత్సరాలుగా.. వరుసగా వన్డేల్లో టాప్‌స్కోరర్‌గా నిలిచిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పుతాడు. ఇప్పటికే అతడు మూడు సార్లు (2011, 2017, 2018) ఈ ఘనత సాధించాడు. అయితే కోహ్లీకి టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నేపాల్‌లో ఘోర ప్రమాదం..12 మంది మృతి

నేపాల్‌లోని సింధుపాల్‌చౌక్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రోడ్డుపై నుంచి అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సింధుపాల్‌చౌక్‌ జిల్లాలో కాలిన్‌చౌక్‌ మందిరం నుంచి ఆదివారం ఉదయం 40 మంది యాత్రికులతో ఓ బస్సు బయలుదేరింది. డోలాఖా ఖాదీచౌర్‌- జిరి రోడ్డు మార్గంలో బస్సు అదుపు తప్పి రోడ్డుపై నుంచి 500 మీటర్ల లోతులో పడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఫాస్టాగ్‌ అమలు.. వాహనాల బారులు

జాతీయ రహదారులపై టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీంతో ఈ విధానానికి సిద్ధంకాని వాహన దారులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. పలు టోల్‌గేట్ల వద్ద పాస్టాగ్‌లేని వాహనదారులు నగదు చెల్లించేందుకు బారులు తీరడంతో రద్దీ ఏర్పడింది. నగదు చెల్లించి వెళ్లేమార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పంతంగి టోల్‌గేట్‌ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. టోల్‌ప్లాజాలోని 5 గేట్ల ద్వారా ఫాస్టాగ్‌, 3 గేట్ల ద్వారా నగదు చెల్లింపు వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.