close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/03/2020 00:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బస్సు-ట్యాంకర్‌-జీపు ఢీ: 8మంది మృతి

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తపి జిల్లాలో బస్సు-ట్యాంకర్‌-జీపు పరస్పరం ఢీకొన్న ఘటనలో 8 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సోన్‌గంద్‌ తాలూకా పరిధిలో గుజరాత్‌ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు ఎదురుగా వస్తున్న మరో ట్యాంకర్‌ పరస్పరం ఢీకొన్నాయి. అక్కడికి కొద్ది సేపటికే ఓ జీపు బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు వాహనాల్లో మొత్తం 8 మంది మరణించారు. గాయపడిన 22 మందిని స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు తరలించారు. ట్యాంకర్‌ రాంగ్‌రూట్‌లో రావడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ట్యాంకర్‌ రాజస్థాన్‌ నుంచి గుజరాత్‌లోని ఉకాయ్‌ పట్టణానికి వెళుతోంది. ట్యాంకర్‌ డ్రైవర్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.