close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 18/04/2020 23:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉగ్ర కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది మృతి

దిల్లీ: కశ్మీర్‌లో ఒకవైపు లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలవుతున్నా.. మరోవైపు తుపాకుల మోత కొనసాగుతోంది. తాజాగా శనివారం ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్‌ పట్టణంలో ఓ చెక్‌పోస్ట్‌ వద్ద విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్‌ బలగాలపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సిబ్బంది అమరులయ్యారు. పలువురికి గాయాలయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ 179 బెటాలియన్‌ బలగాల సంయుక్త ఆధ్వర్యంలో ఈ చెక్‌పోస్ట్‌ నిర్వహణ కొనసాగుతోంది. పారామిలిటరీ బలగాలపై ఈ వారంలో ఇది మూడో దాడి కావడం గమనార్హం. శుక్రవారం సైతం పుల్వామాలోని ఓ చెక్‌పోస్ట్‌ వద్ద ఉగ్రవాదులు ఇదే తరహా దాడికి పాల్పడగా..  సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఒకరు గాయపడ్డారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.