close

తాజా వార్తలు

Published : 26/04/2020 20:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

15 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందికి కరోనా

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో 15 మంది సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీసు ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్) సిబ్బందికి కరోనా వైరస్‌ సోకిందని ఆదివారం అధికారులు తెలిపారు. వాళ్లంతా దిల్లీలోని 31వ బెటాలియన్‌కు చెందినవారని పేర్కొన్నారు. దీంతో ఈ యూనిట్‌లో కరోనా బాధితుల సంఖ్య 24కి పెరిగిందని వెల్లడించారు. గురువారం ఈ యూనిట్‌లో తొమ్మిది మందికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాధితుల్ని మండ్వాలి ప్రాంతంలోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాక కొంత మంది జవాన్ల నమూనాను సేకరించి పరీక్షలకు నిర్వహించామని, ఫలితాలు కోసం వేచిచూస్తున్నామని పేర్కొన్నారు.

గత వారం బెటాలియన్‌కు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్‌ నుంచి కరోనా సోకిందని అధికారులు భావిస్తున్నారు. 162వ బెటాలియన్‌కు చెందిన అతడు జమ్ము కశ్మీర్‌లోని కుప్వారా ప్రాంతంలో నర్సింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే సెలవులో నొయిడాకి వెళ్లాడు. అతడిని దిల్లీలోని 31 బెటాలియన్‌లో రిపోర్ట్‌ చేయాలని అధికారులు ఆదేశించారు. అతడికి పరీక్షలు చేయగా ఏప్రిల్‌ 21న కరోనా సోకిందని తేలింది.


 


 

Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని