రీజియన్‌కు అయిదు సంజీవని బస్సులు
close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share
రీజియన్‌కు అయిదు సంజీవని బస్సులు


నెల్లూరుకు చేరిన సంజీవని బస్సులు

నెల్లూరు (రవాణా), న్యూస్‌టుడే: నెల్లూరు రీజియన్‌కు మూడు సంజీవని బస్సులు వచ్చాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరీక్షలు చేసేందుకు ఈ బస్సులను మొబైల్‌ పరీక్ష కేంద్రాలుగా సేవలందించనున్నాయి. కరోనా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి చెంతకు ఈ బస్సుల్లో వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు చేస్తారు. మారుమూల ప్రాంతాల్లో పరీక్షలు చేసేందుకు ఇవి వెళతాయి. రీజియన్‌కు అయిదు బస్సులను ప్రభుత్వం కేటాయించిందని ఆర్‌ఎం పి.వి. శేషయ్య తెలిపారు. వీటిలో మూడు బస్సులు బుధవారం నెల్లూరుకు చేరుకున్నాయి. మరో రెండు రోజుల్లో రెండు బస్సులు చేరుకుంటాయి.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన