close

తాజా వార్తలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
3,000దాటిపోయాయి

● 24 గంటల్లో 300 కొవిడ్‌ కేసులు ●

22 మరణాల్లో 10 తిరుపతి నగరంలోనే..

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు, తిరుపతి(వైద్యవిభాగం): జిల్లాపై వైరస్‌ వికృతరూపం దాలుస్తోంది. జూన్‌ నెలాఖరు వరకు చాప కింద నీరులా కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం వాయువేగంతో విస్తరిస్తున్నాయి. జిల్లాలో 1000 నుంచి 1,500 కేసులకు చేరడానికి ఆరు రోజులు పట్టగా.. ఆ తరువాత 500 కేసుల నమోదుకు అయిదు రోజులు, 2000- 2500కు నాలుగు రోజులు, మరో 500 పాజిటివ్‌లకు కేవలం రెండే రోజులే పట్టింది. ఇలా రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. శనివారం నాటికి వైరస్‌తో 22 మంది మరణించగా.. ఈనెల 1 నుంచి 11 మధ్య 15 మంది కన్నుమూశారు. 22 మరణాల్లో పది తిరుపతి నగరంలోనే సంభవించాయి.

తిరుపతిలో 144 కేసులు..

అత్యధికంగా 870 కేసులు తిరునగరిలోనే వెలుగుచూశాయి. వైద్య ఆరోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు 300 మందికి వైరస్‌ నిర్ధారణయింది. ఇందులో ఒక్క తిరుపతి నగరంలోనే 144 కేసులు బయటపడ్డాయి. తిరుపతి గ్రామీణలో 24 మందిలో లక్షణాలు కనిపించాయి. మిగతా కేసుల వివరాలు ఇలా.. పుత్తూరు 16, నగరి 12, ఏర్పేడు 9, మదనపల్లె 7, నిండ్ర, సత్యవేడు, చంద్రగిరి మండలాల్లో నాలుగేసి, చిత్తూరు నగరం, సోమల, వడమాలపేట, విజయపురంలో మూడేసి, చౌడేపల్లె, నారాయణవనం, పుంగనూరు, ఎర్రావారిపాళెంలో రెండేసి, బంగారుపాళ్యం, చిన్నగొట్టిగల్లు, కలికిరి, కురబలకోట, నాగలాపురం, పాకాల, పెద్దమండ్యం, పిచ్చాటూరు, రేణిగుంట, తవణంపల్లె, వి.కోట, వెదురుకుప్పం మండలాల్లో ఒక్కొక్కరు, ఉపాధి నిమిత్తం ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన 28 మంది, ఇతర జిల్లాల వాసులు 16 మందికి మహమ్మారి సోకింది. తిరుపతి నగరంలో ఏడాది వయసున్న చిన్నారులు ముగ్గురు, పుత్తూరులో మూడేళ్ల చిన్నారి, మదనపల్లెలో 85 ఏళ్ల, తిరుపతి గ్రామీణలో 78 ఏళ్ల వృద్ధురాలు వైరస్‌ బారిన పడ్డారు.

రాత్రికి 64 కేసులు..

శనివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 64 కొవిడ్‌ కేసులు వెలుగు చూశాయి. తిరుపతి నగరం 29, తిరుపతి గ్రామీణ 18, చిత్తూరు నగరం 2, చంద్రగిరి, కార్వేటినగరం, నగరి, పీలేరు, పూతలపట్టు, పుత్తూరు, రేణిగుంట, సత్యవేడు, వి.కోట, వెదురుకుప్పం మండలాల్లో ఒక్కొక్కరికి, ఇతర జిల్లావాసులు ఐదుగురిలో లక్షణాలు బయటపడ్డాయి. ఇప్పటివరకు 3,074 మందికి పాజిటివ్‌గా తేలగా.. 1,240 మంది డిశ్ఛార్జి అయ్యారు. 1,812 యాక్టివ్‌ కేసులున్నాయి.

76 మంది డిశ్ఛార్జ్‌..

తిరుపతి రాష్ట్ర కొవిడ్‌ ఆస్పత్రి (స్విమ్స్‌) నుంచి 8మందిని, జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి - 2(రుయా) నుంచి ఏడుగురిని, శ్రీ పద్మావతి కొవిడ్‌ సెంటర్‌ నుంచి 38 మందిని, శ్రీనివాసం కొవిడ్‌ సెంటర్‌ నుంచి 23 మందిని ఇంటిని పంపారు.


జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.