close

తాజా వార్తలు

నిజాయతీ చాటిన ఆటోడ్రైవర్‌..!

విద్యాధరపురం, (విజయవాడ)న్యూస్‌టుడే: దుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తుడు ఆటోలో మరిచిపోయిన రూ.2.15 లక్షల నగదు, ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ సర్టిఫికెట్ల బ్యాగును తిరిగి అప్పగించిన ఘటన వన్‌టౌన్‌ పోలీసు స్టేషను పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా నగరి పట్టణానికి చెందిన కోదండరామ్‌ తన కుమార్తె నిహారికకు ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ నిమిత్తం విజయవాడ నగరానికి వచ్చారు. గవర్నరుపేటలోని లాడ్జి నుంచి వారు దుర్గమ్మ దర్శనం చేసుకునేందుకు ఆటోలో వచ్చారు. దర్శనం హడావుడిలో నగదు, కుమార్తె సర్టిఫికెట్లు ఉన్న బ్యాగ్‌ను వారు ఆటోలో మరిచిపోయారు. దుర్గమ్మ దర్శనం చేసుకున్న తరువాత బ్యాగు కనిపించక పోవడంతో ఆటోలో మరిచిపోయినట్లు గ్రహించి వారు ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. అయితే వారు ఆటో నెంబరు చెప్పలేకపోయారు. దీనితో పోలీసులు ఆటో వెళ్లిన రహదారిపై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా వారు వచ్చిన ఆటో వెనక ఆత్మబంధువు అని పోస్టరు కనిపించింది. దాని ఆధారంగా పోలీసులు ఆటో ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. సాయంత్రం 4గంటలకు ఆటో డ్రైవరు వడ్డాది వెంకటేష్‌ ఇంటికి వెళ్లిన తరువాత చూడగా ఆటోలో బ్యాగు కనిపించింది. వెంటనే అతను తెలిసిన ఆటో డ్రైవర్లను వెంట తీసుకొని సదరు బ్యాగును వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించేందుకు వచ్చారు. బ్యాగు పోగొట్టుకున్న తండ్రీ, కమార్తెకు  విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. వన్‌టౌన్‌ సీఐ కాశీవిశ్వనాథ్‌ సమక్షంలో ఆ బ్యాగ్‌ను కోదండరామ్‌కు ఆటో డ్రైవరు చేతుల మీదుగా అప్పగించారు. నిజాయతీ చాటుకున్న వెంకటేష్‌ను పోలీసు అధికారులు అభినందించడంతోపాటు  నగదు రివార్డును అందజేశారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.