close

తాజా వార్తలు

జిల్లాలో సేవలు సంతృప్తినిచ్చాయి
బదిలీపై వెళుతున్న ట్రెజరీ డీడీ శేషగిరి
శేషగిరి దంపతులను సత్కరిస్తున్న ట్రెజరీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు
 

కాకినాడ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా ఖజానాశాఖ ఉప సంచాలకుడు మేకా శేషగిరి బదిలీ అయ్యారు. రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి టి.వనిత వద్ద పీఎస్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు బదిలీపై వెళ్తున్న శేషగిరి దంపతులకు ఆదివారం స్థానిక రహదారులు, భవనాల అతిథి గృహంలో ఏపీ ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా యూనిట్‌ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. సభకు అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పాము శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శేషగిరి మాట్లాడుతూ జిల్లాలో సేవలు ఎంతో సంతృప్తినిచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి వై.భాస్కరరావు, ప్రతినిధులు చంద్రశేఖర్‌, వైఎన్‌ మూర్తి, సావిత్రి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇన్‌ఛార్జి డీడీగా పార్వతి... జిల్లా ఖజానా శాఖ ఉపసంచాలకులు(ఇన్‌ఛార్జి)గా డి.పార్వతి నియమితులయ్యారు. ఈ మేరకు ఖజానా శాఖ డైరెక్టరేట్‌ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్వతి ఖజానా శాఖలో సహాయ సంచాలకురాలి హోదాలో రాజమహేంద్రవరం డివిజన్‌ సబ్‌ట్రెజరీలో పనిచేస్తున్నారు. ఆమె ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.


జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.