ఈరోజు (02-05-2024)

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం శుభకరం.

ఈవారం (28-04-2024 - 04-05-2024)

దైవబలం రక్షిస్తోంది. ప్రారంభించబోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి  అనుకున్నది సాధిస్తారు . స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఒక వ్యవహారంలో డబ్బు  అందుతుంది. ముఖ్యమైన విషయాల్లో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు కొన్నింటిని అమలు చేయగలుగుతారు. ఆర్ధికంగా వృద్ధి చెందుతారు. విరోధులకు దూరంగా ఉండాలి. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. 


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?