ఈరోజు (19-04-2024)

కష్టపడి పనిచేస్తే లక్ష్యాలు నెరవేరుతాయి. వృథా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీరు ఆశించిన ఫలితాలు రావాలంటే ఎక్కువగా శ్రమించాలి. బంధువుల అండదండలు ఉంటాయి. హనుమత్ ఆరాధన శుభప్రదం.

ఈవారం (14-04-2024 - 20-04-2024)

కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. మీ మీ రంగాల్లో అవగాహనతో ముందుకు సాగాలి.  ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.  కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో  జాగ్రత్త అవసరం. కలహ సూచన ఉంది కాబట్టి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఇష్టదైవారాధన శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని