త్వరలో విండోస్‌ కొత్త అప్డేట్‌.. 

తాజా వార్తలు

Published : 27/05/2021 00:20 IST

త్వరలో విండోస్‌ కొత్త అప్డేట్‌.. 

ఈ దశాబ్దానికే ప్రత్యేకంగా నిలుస్తుందన్న మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల

ఇంటర్నెట్‌ డెస్క్‌: విండోస్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త వెర్షన్‌ అప్డేట్‌ గురించి సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ తీపి కబురు చెప్పింది. అతి త్వరలో ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు సంబంధించి కొత్త అప్డేట్‌ను విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడించారు. ‘బిల్డ్‌ 2021’ సదస్సులో ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు. ఇంతకు ముందు వెర్షన్లతో పోలిస్తే.. త్వరలో ప్రవేశపెట్టబోయే విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్డేట్‌ ఈ దశాబ్దానికే తలమానికంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త వెర్షన్‌లో ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌, స్టార్ట్‌ మెనూ, యాక్షన్‌ సెంటర్‌ సహా పలు ఫీచర్లకు సంబంధించిన డిజైన్లలో చాలా మార్పులు చేయనున్నట్టు తెలిపారు. అయితే ఆ మార్పుల గురించి మాత్రం ఆయన వివరించలేదు. కొత్త అప్డేట్‌తో విండోస్‌ డెవలపర్స్‌, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సృష్టికర్తలకు ఈ రంగంలో మరిన్ని అవకాశాలు లభిస్తాయని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. కొన్ని నెలలుగా తాను స్వయంగా కొత్త అప్డేట్‌కు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తానన్నారు. మైక్రోసాఫ్ట్‌ కొన్ని నెలలుగా యూజర్‌ ఇంటర్‌ఫేజ్‌లలో తీసుకురావాల్సిన మార్పులు, కొత్త యాప్‌ స్టోర్‌ రూపకల్పనపై దృష్టి సారించింది. డెవలపర్స్‌కు  మెరుగైన ఆర్థిక వనరులను ఈ కొత్త అప్డేట్‌ సృష్టిస్తుందని సత్య నాదెళ్ల తాజా వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. విండోస్‌ 95 ఐకాన్స్‌ మాయమై.. భవిష్యత్తులో సరికొత్త ఐకాన్స్‌ను కూడా చూసే అవకాశం లేకపోలేదు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని