AP News: పోలవరం స్పిల్‌వే మీదుగా నీరు విడుదల

తాజా వార్తలు

Updated : 11/06/2021 15:20 IST

AP News: పోలవరం స్పిల్‌వే మీదుగా నీరు విడుదల

పోలవరం: పోలవరం ప్రాజెక్టు నుంచి డెల్టాకు స్పిల్‌ వే మీదుగా గోదావరి నీటిని విడుదల చేశారు. గోదావరిలో వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసే అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ పూర్తి కావడంతో స్పిల్‌వే మీదుగా నీటిని మళ్లించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆళ్ల నాని వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రాజెక్టు వద్ద పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, మేఘా ఇంజినీరింగ్‌ ప్రతినిధులు హాజరయ్యారు. 

గోదావరిలో అప్రోచ్‌ కెనాల్‌కు నీరు విడుదల చేయడంతో స్పిల్‌వే, రివర్‌ స్లూయిజ్‌ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీకి.. అక్కడి నుంచి సెంట్రల్‌ డెల్టా, తూర్పు, పశ్చిమ కాల్వల ద్వారా గోదావరి డెల్టాకు చేరనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని