విశాఖ ఉక్కు ఉద్యోగి అదృశ్యంలో కొత్త ట్విస్ట్‌! 

తాజా వార్తలు

Published : 21/03/2021 02:05 IST

విశాఖ ఉక్కు ఉద్యోగి అదృశ్యంలో కొత్త ట్విస్ట్‌! 

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న వేళ శ్రీనివాసరావు అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటానంటూ లేఖరాసి అదృశ్యమైన వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. అతడి అదృశ్యంపై విశాఖ పోలీసులు వివరణ ఇచ్చారు. ‘స్టీల్‌ప్లాంట్‌లో శ్రీనివాసరావు ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. ఆత్మహత్య చేసుకుంటానని ప్లాంట్‌ లాగ్‌బుక్‌లో రాశాడు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో పడి చనిపోవడం అసాధ్యమని అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి 10గంటలకు విధులకు హాజరయ్యాడు. ఉద్యోగాల పేరుతో ఇద్దరి వద్ద రూ.50లక్షలు వసూలు చేశాడు. శనివారం ఉదయం ఉద్యోగాల ప్రకటన వస్తుందని వారిని నమ్మించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మరో 16 మందిని కూడా నమ్మించాడు. స్టీల్‌ప్లాంట్‌లో ఎలాంటి అఘాయిత్యానికీ పాల్పడలేదు. శ్రీనివాసరావు ఘటనపై మిస్సింగ్‌ కేసు నమోదు చేశాం’’ అని ఏసీపీ పెంటారావు వివరించారు. 

గాజువాకకు చెందిన శ్రీనివాసరావు ఉక్కు ఫర్నేస్‌లో అగ్నికి ఆహుతవుతానంటూ రాసిన లేఖ ఈ ఉదయం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అతడి టేబుల్‌ వద్ద ఐడీ కార్డు, పర్సు, చరవాణి, లేఖను గుర్తించిన పోలీసులు, కార్మికులు వివరాలు సేకరించారు. ఈ క్రమంలో అతడు ఉద్యోగాల పేరుతో కొందరిని నమ్మించాడని పోలీసులు వెల్లడించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని