విజయవాడ ఏసీపీకి నాలుగు వారాల జైలు శిక్ష 

తాజా వార్తలు

Updated : 16/07/2021 19:55 IST

విజయవాడ ఏసీపీకి నాలుగు వారాల జైలు శిక్ష 

అమరావతి: కోర్టు ధిక్కార కేసులో విజయవాడ ఏసీపీగా పనిచేసిన కె.శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు నాలుగు వారాల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలును వారం రోజుల పాటు న్యాయస్థానం వాయిదా వేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని ఏసీపీకి గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో పిటిషనర్‌ కోర్టు ధిక్కార వ్యాజ్యం దాఖలు చేశారు. వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ జరిపింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు.. ఏసీపీ కె.శ్రీనివాసరావుకు నాలుగు వారాల జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని