వీహెచ్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య పరామర్శ

తాజా వార్తలు

Updated : 12/07/2021 11:46 IST

వీహెచ్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్య పరామర్శ

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు(వీహెచ్‌)ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరామర్శించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతూ హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీహెచ్‌కు ఆయన ఫోన్‌ చేసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సలహాలను పాటించి కోలుకోవాలని సూచించారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. తనను గుర్తు పెట్టుకొని పరామర్శించిన వెంకయ్యకు వీహెచ్‌ ధన్యవాదాలు తెలిపారు. ఉప రాష్ట్రపతి పరామర్శతో తనకు ఉత్సాహం వచ్చిందని చెప్పారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని