వివేకా ఆలోచనలు అర్థం చేసుకోవాలి: వెంకయ్య

తాజా వార్తలు

Published : 12/01/2021 12:09 IST

వివేకా ఆలోచనలు అర్థం చేసుకోవాలి: వెంకయ్య

దిల్లీ‌: పేదవారికి చేసే సేవను ‘నారాయణ సేవ’గా అభివర్ణించిన వివేకానందుడి ఆలోచనలను ప్రజలంతా అర్థం చేసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మంగళవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వివేకానందుడికి ట్విటర్‌ ద్వారా నివాళులర్పించారు. 

భారతదేశ సంస్కృతి, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా భారతీయులను జాగృతం చేసిన గొప్ప మహనీయుడు స్వామి వివేకానందుడని కొనియాడారు. ప్రపంచ యువనికపై భారతదేశం ఓ శక్తిగా విరాజిల్లాలన్న సంకల్పంతో యువతను ఉత్తేజితం చేసి శారీరక, మానసిక దృఢత్వం, ఆత్మవిశ్వాసం, ఆధ్యాత్మికత ఆవశ్యకత కోసం ఆయన చేసిన బోధనలు అనుసరణీయమన్నారు. యువత ఈ దిశగా అడుగులు వేసి జీవితాలను ఆనందమయం చేసుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని