వ్యవసాయం వల్లే దేశం కోలుకుంది: ఉపరాష్ట్రపతి

తాజా వార్తలు

Updated : 31/03/2021 15:29 IST

వ్యవసాయం వల్లే దేశం కోలుకుంది: ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌: కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుందంటే అందుకు వ్యవసాయ రంగమే కారణమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. రైతులను ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ జాబితాలో చేర్చాలని సూచించారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో విశ్రాంత ఐఏఎస్‌ మోహన్‌కందా రాసిన ‘‘భారత్‌లో వ్యవసాయం.. రైతుల  ఆదాయం రెట్టింపులో సవాళ్లు’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య పాల్గొన్నారు. వ్యవసాయం చేసే వారి సంఖ్య తగ్గుతోందని.. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని వెంకయ్య నాయుడు సూచించారు. 

‘‘దేశంలో సగం మందికి పైగా వ్యవసాయమే ఆధారం. సాగు లాభసాటిగా లేకపోవడంతో వ్యవసాయాన్ని వీడుతున్నారు. కొవిడ్‌ వల్ల అన్ని రంగాలు దెబ్బతింటే వ్యవసాయం తట్టుకొని నిలబడింది. కరోనా వల్ల పౌష్టికాహారంపై శ్రద్ధ పెరిగింది. గిట్టుబాటు ధరలు కల్పిస్తే రుణమాఫీ అవసరం లేదు’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని