భాజపా కార్యాలయంలో ఉగాది వేడుకలు

తాజా వార్తలు

Updated : 13/04/2021 13:50 IST

భాజపా కార్యాలయంలో ఉగాది వేడుకలు

హైదరాబాద్‌: నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, చింతల రామచంద్రారెడ్డి పలువురు భాజపా ముఖ్యనేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.  మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. కరోనాతో కోట్ల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కిషన్‌రెడ్డి అన్నారు. ప్లవ నామ సంవత్సరంతో వెలుగులోకి అడుగుపెట్టామన్నారు. ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురిసి ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందాలన్నారు.  బండి సంజయ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలన్నారు. నిస్వార్థంగా పని చేస్తే ఏ వ్యక్తికి అన్యాయం జరగదని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.  

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని