ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

తాజా వార్తలు

Updated : 13/04/2021 17:28 IST

ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం సీఎం జగన్‌ పండితులను సత్కరించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ వ్యవసాయ పంచాంగం ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘ ప్రతి ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడాలి. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలి. కరోనా పీడ శాశ్వతంగా విరగడ కావాలి’’ అని ఆకాంక్షించారు.   Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని