ప్రైవేట్‌ టీచర్ల ఆర్థికసాయానికి నిధులు విడుదల

తాజా వార్తలు

Updated : 13/04/2021 14:39 IST

ప్రైవేట్‌ టీచర్ల ఆర్థికసాయానికి నిధులు విడుదల

హైదరాబాద్‌: కరోనా దృష్ట్యా విద్యాసంస్థలు మూతపడటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న గుర్తింపు పొందిన ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయానికి నిధులు విడుదలయ్యాయి. ఏప్రిల్‌ నెలలో అందించేందుకు ప్రభుత్వం రూ.32కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పాఠశాలలు తిరిగి తెరిచేవరకు ప్రతినెలా ఒక్కొక్కరికి రూ.2వేల ఆర్థిక సాయం, 25 కిలోల బియ్యం అందివ్వాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. 

సీఎం నిర్ణయం నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. దీని ద్వారా దాదాపు లక్షన్నరమంది ప్రైవేట్‌ టీచర్లు, ఇతర సిబ్బందికి లబ్ధి చేకూరనుంది. ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బంది తమ ధ్రువీకరణ, బ్యాంకు ఖాతా తదితర వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఇప్పటికే అధికారులు సూచించిన విషయం తెలిసిందే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని