TS: వ్యాక్సిన్‌కు గ్లోబల్ టెండర్లు ఆహ్వానం

తాజా వార్తలు

Published : 19/05/2021 13:06 IST

TS: వ్యాక్సిన్‌కు గ్లోబల్ టెండర్లు ఆహ్వానం

హైదరాబాద్‌: తెలంగాణలో కొవిడ్‌ టీకాల సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. రాష్ట్ర వైద్య సదుపాయాల మౌలిక వసతుల సంస్థ (టీఎస్‌ఎంఐడీసీ) ద్వారా కోటి వ్యాక్సిన్ల కోసం ఈ టెండర్లను పిలిచింది. నెలకు కనీసం 15లక్షల డోసులు సరఫరా చేయాలని.. 6 నెలల్లో కోటి డోసులు సరఫరా చేయాలని నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది. టెండర్ల దాఖలకు ఈనెల 21 వరకు అవకాశం కల్పించింది.

టెండర్‌ ప్రక్రియలో భాగంగా ఈనెల 26న ప్రీబిడ్‌ సమావేశం నిర్వహించనున్నారు. టెండర్ల దాఖలుకు జూన్‌ 4 చివరి తేదీగా నిర్ణయించారు. ఐసీఎంఆర్‌ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశం మేరకు గ్లోబల్‌ టెండర్లను పిలిచారు. తక్కువ కోట్ చేసిన సంస్థకు వ్యాక్సిన్ సరఫరా బాధ్యతలను ప్రభుత్వం అప్పగించనుంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని