టీఎస్‌ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

తాజా వార్తలు

Published : 18/03/2021 23:39 IST

టీఎస్‌ ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2021 నోటిఫికేషన్‌ గురువారం విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పరీక్ష తేదీలు, ఫీజులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 20న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమై.. మే 5తో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. జులై 7, 8 ,9 తేదీల్లో ఇంజినీరింగ్‌ పరీక్ష, జులై 5, 6 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడికల్‌ పరీక్షను నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ పేరును రిజిస్టర్‌ చేసుకోవడానికి రూ.800 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ కేటగిరీ అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోవడానికి ఫీజు రూ.400 గా నిర్ణయించారు. ఈ రెండు పరీక్షలకు దరఖాస్తు చేయాలనుకుంటే రూ.1600లు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌ అభ్యర్థులు రూ.800 చెల్లిస్తే సరిపోతుంది. ఈ పరీక్షను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున జేఎన్టీయూ హైదరాబాద్‌(JNTUH)నిర్వహించనుంది. ఇక సిలబస్‌ విషయానికి వస్తే ఇంటర్‌ మొదటి సంవత్సరం నుంచి 55 శాతం ప్రశ్నలు, ద్వితీయ సంవత్సరం నుంచి 45 శాతం ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష విషయానికి వస్తే 180 నిమిషాల్లో 160 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని