Corona Pandemic: ఉపశమనమిచ్చే వార్తలివే!
close

తాజా వార్తలు

Updated : 18/05/2021 19:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona Pandemic: ఉపశమనమిచ్చే వార్తలివే!

ఇంటర్నెట్‌డెస్క్‌: వివిధ రాష్ట్రాలు ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధించడంతో కరోనా కల్లోల పరిస్థితులు ఇప్పుడిప్పుడే దారికి వస్తున్నాయి. రోజువారీ నమోదవుతున్న కేసుల్లో తగ్గుదలే ఇందుకు కారణం. మరోవైపు కరోనా నుంచి కోలుకునేవారు పెరుగుతున్నారు. కేవలం, కరోనా కేసులు, మరణాల వార్తలే కాదు, కొన్ని పాజిటివ్‌ పాయింట్లను మీ ముందుకు తీసుకొస్తున్నాం. అంటే కరోనావేళ మీరనుకునే ‘పాజిటివ్‌’ కాదులెండి..! కాస్త ఉపశమనమిచ్చే అంశాలు..

👍 దేశంలో కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 4.22లక్షల మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. గత 5 రోజులుగా కొత్త కేసుల కన్నా రికవరీ కేసులే అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం.

👍 స్టాండర్డ్‌ ఛార్టెడ్‌ బ్యాంకు తన ఉద్యోగులకోసం ప్రత్యేక సదుపాయాలు ప్రకటించింది. కరోనా బారినపడి ఐసీయూలో చికిత్స పొందుతున్న వారికి వైద్య ఖర్చుల్లో రూ.2.5లక్షలు రీఇంబర్స్‌మెంట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదే విధంగా ఆరు నెలల ముందస్తు జీతాన్ని అది కూడా వడ్డీ రహితంగా ఇవ్వనున్నట్లు తెలిపింది. కరోనాతో బాధపడుతూ చనిపోయిన ఉద్యోగి కుటుంబానికి నాలుగు సంవత్సరాల వేతనాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.

👍 ప్రపంచ దేశాలకు 8 కోట్ల టీకాలను అందించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. ఫైజర్‌, మోడెర్నా, జాన్సన్ అండ్‌ జాన్సన్ టీకాలను వచ్చే ఆరు వారాల్లో ప్రపంచ దేశాలకు అందించనున్నట్లు ప్రకటించారు.

👍 భారత్‌లో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వేరియంట్లపై ఫైజర్‌, మోడెర్నా టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అమెరికాకు చెందిన ఎన్‌వైయూ గ్రాస్‌మాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌, లాంగోన్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధనను నిర్వహించారు.

👍 కొవిడ్‌తో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయి అనాథలైన పిల్లలకు 25ఏళ్లు వచ్చేదాకా నెలకు రూ.2500 చొప్పున ఆర్థిక సాయంతో పాటు ఉచిత విద్య అందిస్తామని దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఇంట్లో సంపాదించే వ్యక్తిని కోల్పోవడంతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు నెలకు రూ.2500 చొప్పున ఇస్తామన్నారు. ఇంట్లో సంపాదించే భర్తను కోల్పోయిన భార్యకు; వివాహం కాని కొడుకును కోల్పోయిన  తల్లిదండ్రులకు ఈ సాయాన్ని అందజేస్తామన్నారు.

👍 కరోనా క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ ప్రీమియం మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ కేటీఎం(బజాజ్‌ ఆటో గ్రూప్‌) తన వినియోగదారులకు ఓ సదవకాశాన్నిచ్చింది. మే 31వ తేదీతో ముగిసే కేటీఎం బైక్‌ సర్వీస్‌, వారెంటీ గడువును ఈ ఏడాది జులై 31 వరకూ పొడిగిస్తున్నట్లు తెలిపింది.

👍 కరోనావైరస్‌ను అత్యంత సమర్థంగా అడ్డుకుంటున్న ఫైజర్‌ టీకాల విషయంలో మరో సానుకూల కబురును ఐరోపా మెడిసిన్‌ ఏజెన్సీ తెలిపింది. ఒక సారి అత్యంత శీతల వాతవారణం నుంచి బయటకు  తీసుకు వచ్చిన టీకాల వయల్స్‌ను వినియోగించకపోతే నెలరోజుల వరకు  ఫ్రిజ్‌లో నిల్వ ఉంచవచ్చని పేర్కొంది. ప్రస్తుతం ఈ పరిమితి ఐదురోజుల వరకే ఉంది.

👍 కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతుండటంతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పొడిగించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. వైరస్‌ కట్టడే లక్ష్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను జూన్‌ 1వరకు కొనసాగించనున్నట్టు వెల్లడించింది.

👍 కరోనాపై పోరాటంలో ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సొల్యూషన్స్‌ ఈజీ మైట్రిప్‌ తనవంతు ప్రయత్నం చేస్తోంది. 550 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను ఆస్పత్రులు, ఎన్జీవోలకు అందిస్తామని ప్రకటించింది.

👍 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రులకు 11వేల మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ సరఫరా చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని