Top 10 News @ 9 PM

తాజా వార్తలు

Published : 28/04/2021 20:56 IST

Top 10 News @ 9 PM

1. cowin:పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల వెల్లువ.. ఆగిన సైట్‌

కరోనా మహమ్మారిని కట్టడి చేసే బృహత్తర వ్యాక్సినేషన్‌లో భాగంగా 18ఏళ్లు దాటిన వారందరికీ టీకా నమోదు ప్రక్రియ బుధవారం(ఏప్రిల్‌ 28) సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమైంది. అయితే వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం పెద్ద ఎత్తున యువత ఒక్కసారిగా కొవిన్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయ్యేందుకు ప్రయత్నించంతో వెబ్‌సైట్‌ కొద్దిసేపు క్రాష్‌ అయ్యింది. చాలా మందికి సర్వర్‌ సమస్యలు తలెత్తడంతో వారంతా సోషల్‌మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. నమోదు ప్రక్రియ అందుబాటులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లో ఈ సమస్య తలెత్తింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Vaccine ధర తగ్గించిన సీరం 

2. జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్‌ బెయిల్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. అందువల్ల బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ వైకాపా ఎంపీ రఘరామకృష్ణరాజు గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. బెయిల్‌ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు తాజాగా ఇవాళ జగన్‌కు నోటీసులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. AP: షెడ్యూల్‌ ప్రకారమే ఇంటర్‌ పరీక్షలు

షెడ్యూల్‌ ప్రకారం వచ్చే నెల 5వ తేదీ నుంచి ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ స్పష్టం చేశారు. కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుని పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై జాయింట్‌ కలెక్టర్లు, ఆర్‌ఐవో, డీఈవోలతో మంత్రి వర్చువల్‌గా సమీక్షించారు. ఏ రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు రద్దు కాలేదని.. పరీక్షలు అనివార్యమని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఏపీలో 14,669 కేసులు.. 71 మరణాలు

4. TS: 14 కేంద్రాల్లో పాస్‌పోర్టు సేవలు నిలిపివేత

తెలంగాణలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల ద్వారా అందిస్తున్న పాస్‌పోర్టు సేవలు రేపటి నుంచి నిలిపివేస్తున్నట్లు సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. మే 14వ తేదీ వరకు వరంగల్‌, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, మెదక్‌, ఆదిలాబాద్‌, యాదాద్రి-భువనగిరి, సిద్దిపేట, మంచిర్యాల, మహబూబాబాద్‌, కామారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి, మేడ్చల్‌ తపాలా కార్యాలయాల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కరోనా సోకిందని అనుమాన పడటం మంచిదే

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాదకరంగా మారింది. మునుపటికన్నా ఎక్కుమంది కరోనా బారిన పడుతున్నారు. కరోనా సోకిన రోగుల్లో ఎక్కువ మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతున్నాయి. ఈ తరుణంలో కరోనా సోకిన వారు ముఖ్యంగా హోం ఐసోలేషన్‌లో ఉన్నవాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర ఆంశాల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్‌ జయచంద్రను ఇంటర్య్వూ చేయగా ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Corona: బెంగళూరులో భారీగా కేసులు! 

6. సీఎం కేసీఆర్‌కు కొవిడ్‌ నెగెటివ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌ నిర్ధారణ అయింది. సీఎం కేసీఆర్‌కు ఇవాళ రాపిడ్‌ యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్‌ పరీక్షలలో సీఎంకు నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ఫలితం రేపు వెల్లడికానుంది. స్వల్ప లక్షణాలతో ఈ నెల 19వ తేదీన సీఎం కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్యుల సూచన మేరకు అప్పటినుంచి ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆ విషయం మీరు విజయ్‌ని అడగండి: రష్మిక

‘గీతగోవిందం’తో స్టార్‌హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు నటి రష్మిక. ప్రస్తుతం ఈ భామ సౌత్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న రష్మిక తాజాగా కొంత సమయంపాటు అభిమానులతో ముచ్చటించారు. ఆ సరదా విశేషాలు మీకోసం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జాన్వీ వెయిటింగ్‌.. సిమ్రత్‌ ఛాలెంజ్‌

8. IN PICS: 5 రోజుల్లోనే  3డీ ప్రింటెడ్‌ ఇల్లు

దేశంలోనే తొలిసారి ఐఐటీ మద్రాస్‌లో 3డీ ప్రింటింగ్‌ పద్ధతిలో నిర్మించిన ఇల్లు ఎంతగానో ఆకట్టుకుంటోంది. 600 చదరపు అడుగులతో నిర్మించిన ఈ 3డీ ప్రింటర్‌ కాంక్రీట్‌ గృహాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దృశ్యమాధ్యమం ద్వారా ఆవిష్కరించారు. ఐఐటీ మద్రాస్‌ పూర్వ విద్యార్థులు ఈ నమూనాను రూపొందించగా.. చెన్నైకు చెందిన త్వస్థ మ్యానుఫ్యాక్చరింగ్‌ సొల్యూషన్స్‌ ఈ గృహాన్ని కేవలం 5 రోజుల్లోనే నిర్మించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Viral Pics: సైకిల్‌పై భార్య మృతదేహంతో..

దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న వేళ కొన్ని దృశ్యాలు మనసుల్ని మెలిపెట్టేస్తున్నాయి. మృతదేహానికి గ్రామంలో అంత్యక్రియలు చేయొద్దంటూ గ్రామస్థులు ఖరాకండిగా చెప్పిన వేళ దిక్కు తోచని స్థితిలో ఓ వృద్ధుడు తన భార్య మృతదేహాన్ని సైకిల్‌పై ఉంచి ఏం చేయాలో తోచని స్థితిలో రోడ్డు పక్కన కూర్చున్న కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జౌన్‌పుర్‌ జిల్లాలోని అంబర్‌పుర్‌కు చెందిన మహిళ రాజ్‌కుమారి (50) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3 వేల మంది కొవిడ్‌ బాధితులు ‘మిస్సింగ్‌’!

10. IPL 2021: మహిళల టీ20 ఛాలెంజ్‌ లేనట్లే!

ఏటా ఐపీఎల్‌ సందర్భంగా మహిళల కోసం నిర్వహించే టీ20 ఛాలెంజ్‌ ఈసారి జరిగేలా కనిపించడం లేదు. ప్రస్తుతం భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వివిధ దేశాలు ఇక్కడికి ప్రయాణ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ లాంటి జట్ల మహిళా క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. అయితే, బీసీసీఐ స్వదేశీ మహిళా క్రికెటర్లతో టీ20 ఛాలెంజ్‌ నిర్వహించాలని చూస్తోంది. దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం అందలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని