Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 03/08/2021 19:49 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. అరచేతిలో అశ్లీలం

వ్యసనం మనిషిని బానిసను చేస్తోంది.  మద్యపానం, ధూమపానం వంటి వ్యసనాల లాగే  నీలి చిత్రాలు చూడటం కూడా ఓ రుగ్మతగా మారుతోంది. దీని దుష్పరిణామాలు వ్యక్తిగతంగానూ, సమాజంపైనా తీవ్రంగా ఉంటున్నాయి. చాలామందిలో.. ముఖ్యంగా బాలలు, యువకుల్లో ఇది అలవాటుగా మొదలై క్రమంగా వ్యసనం అవుతోంది. నేర ప్రవృత్తికీ దారితీస్తోంది. వావి వరుసలే కాదు, వయసు, తారతమ్యాలు, లింగభేదం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. తల్లి పక్కన ఆదమరచి నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన వరంగల్‌ నిందితుడు ప్రవీణ్‌ ఉదంతమే ఇందుకు నిదర్శనం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పురుషత్వంపై విష పంజా

2. ఇంతకీ.. ఆ భూములు ఎవరివి?

 కృష్ణా జిల్లా కొండపల్లి, జి.కొండూరు మండలం పరిధిలో వివాదాస్పద మైనింగ్‌ భూముల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదంటూ మాజీ మంత్రి దేవినేని ఉమా కొండపల్లి ప్రాంతంలో పర్యటించడం, వైకాపా వర్గాలు అడ్డుకోవడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరోసారి సంయుక్త సర్వే జరిపేందుకు అధికార పార్టీ నేతలు రెవెన్యూ, అటవీశాఖలపై ఒత్తిడి పెంచుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గేమింగ్‌ ఉద్యోగాలపై మహిళల మక్కువ

దక్షిణాది రాష్ట్రాల్లో గేమింగ్‌ రంగంలో ఉద్యోగాలపై మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు ‘హెచ్‌పీ ఇండియా గేమింగ్‌ ల్యాండ్‌స్కేప్‌ రిపోర్ట్‌- 2021’ సర్వే విశ్లేషించింది. ‘గేమింగ్‌ ఉద్యోగాలను 84 శాతం మంది మహిళలు ఇష్టపడుతున్నారు. ఈ రంగంలో వృత్తిజీవితం (కేరీర్‌) నిర్మించుకోవాలనే ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. మగవారిలో 82 శాతం మంది గేమింగ్‌ ఉద్యోగాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు.’ అని ఈ నివేదిక విశ్లేషించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* గృహరుణంపై పరిశీలనా రుసుము రద్దు: ఎస్‌బీఐ

4. బాహుబలితో ఆ భయం పోయింది

పదిహేనేళ్లకే తెరంగేట్రం చేసి, ప్రముఖ హీరోల సరసన జోడీ కట్టి... ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని పదిలపరుచుకున్న నటి సింధీ సుందరి తమన్నా. త్వరలో ‘ఎఫ్‌3’, ‘మ్యాస్ట్రో’, ‘సీటీమార్‌’, ‘దటీజ్‌ మహాలక్ష్మి’ వంటి సినిమాల్లో కనిపించబోతున్న ఈ మిల్కీబ్యూటీ తన ఇష్టాయిష్టాల గురించి చెబుతోందిలా... కప్పుడు నాకు ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’లో నటించే అవకాశం వచ్చినా చివరి నిమిషంలో పోయింది. అప్పుడు ప్రభాస్‌తో నటించే ఛాన్స్‌ పోయినందుకు కాస్త బాధనిపించింది కానీ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పొలంలో బయటపడ్డ భారీ గణపతి విగ్రహం

 పొలం దున్నుతుండగా భారీ గణపతి విగ్రహంతో పాటు పీఠం బయటపడ్డాయి. ఈ సంఘటన శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం తుర్కపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కపల్లికి చెందిన అనంతరావు దేశ్‌ముఖ్‌ గ్రామ శివారులో తనకున్న పొలంలో కొన్నేళ్లుగా వర్షాధార పంటలైన పత్తి, కంది, మినుము, పెసర వంటివి సాగుచేస్తున్నారు. ఈసారి వర్షాలు బాగా కురవడం, నీరు అందుబాటులో ఉండటంతో మాగాణి చేయాలని నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

వదల రాజయ్యా.. నిన్నొదల..!

6. వెయ్యి పేజీల పుస్తకమైనా క్షణాల్లో అనువాదం

 మాతృభాష కాకుండా ఇతర భాషల్లోని పుస్తకాలు, గ్రంథాలను చదవడం, వాటిని అర్థం చేసుకోవడం క్లిష్టమైన వ్యవహారమే. అందుకోసం ఆ భాష నేర్చుకోవడం లేదంటే వాటి అనువాదాలు వచ్చే వరకూ వేచి ఉండక తప్పదు. ప్రస్తుతం కొన్ని యాప్‌లు సమాచారాన్ని ఇతర భాషల్లోకి అనువాదం చేస్తున్నా వాటి కచ్చితత్వంపై విశ్వసనీయత తక్కువే. ఈ పరిస్థితి బాధాకరమని, క్షణాల్లో అనువాదం చేసే సాంకేతికతను అభివృద్ధి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర విద్యాశాఖ అధికారులకు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. స్నేహ బంధం... ఎంతో మధురం..!

‘స్నేహితుడి కోసం ప్రాణాలు అర్పించడం అంత కష్టమైన పని కాదు. కానీ ప్రాణాలు అర్పించేంత గొప్ప స్నేహితులను సంపాదించుకోవడం చాలా కష్టం’ ‘నవ్వు అన్నది ఇక నా జీవితాన ఒక గతం మాత్రమే అని నమ్మిన మనసుని మళ్లీ నవ్వేలా చేయగలిగినది స్నేహం మాత్రమే’... ఇలా స్నేహం గురించి ఎన్ని భాష్యాలు చెప్పుకున్నా తక్కువే. అందుకే అన్నాడో కవి ‘స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అని...’  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నువ్వే నా ప్రాణం నేస్తమా!

8. అమృత ఘడియలవి!

బిడ్డను చిరంజీవిగా ఉండమని ఆశీర్వదించే అమృతమే.. అమ్మపాలు! అందులోనూ ముర్రుపాల శక్తి బిడ్డకు అందితీర్సాలిన ఔషధం.. ఇవన్నీ కాబోయే అమ్మకు తెలిస్తేనే కదా తన బిడ్డను చిరంజీవిగా మార్చేది... కాన్పు తర్వాత బాలింతల్లో మొదట వచ్చే పాలు చిక్కగా, పసుపు రంగులో ఉంటాయి. దీన్నే కొలెస్ట్రమ్‌ అంటాం. పోషకాలు పుష్కలంగా ఉండే ఇది చాలా తక్కువ మొత్తంలోనే అందినా పాపాయి అవసరాలకి సరిపోతుంది. రోజులో ఒకటి నుంచి నాలుగు చెంచాల పాలు ఉత్పత్తి అవుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కూలిన ఆశలు..

ఇటు సింధు.. అటు పసిడి పోరు.. మధ్యలో ఓ పెద్ద అడ్డంకి! ఆ అడ్డంకిని దాటితే.. ఆపై ఒలింపిక్స్‌ స్వర్ణమూ సాధిస్తే..? భారత క్రీడా చరిత్రలోనే అత్యుత్తమ అథ్లెట్‌గా చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుత అవకాశం తెలుగమ్మాయిది! గ్రూప్‌ దశలో మామూలుగానే ఆడినా.. నాకౌట్‌కు వచ్చేసరికి  అస్త్ర శస్త్రాలన్నీ బయటికి తీసి.. ప్రత్యర్థుల బలహీనతలన్నీ చదివేస్తూ.. అత్యుత్తమ ఆటతో దూసుకెళ్తున్న సింధు.. మరో అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* 33 ఏళ్ల రికార్డు బద్దలు

10. ఇడ్లీ... రూపాయే!

మీ ఊళ్లో ప్లేట్‌ ఇడ్లీ ఎంత? పాతిక, ముప్ఫై, యాబ్బై, డెబ్బయి.. అబ్బో ధర పెరుగుతూ పోతుందే తప్ప తగ్గడం లేదు కదా. ఈ రోజుల్లో బయట టిఫిన్‌ తినాలంటే జేబులో తక్కువలో తక్కువ పాతిక రూపాయలైనా ఉండాల్సిందే. అలాంటిది రూపాయికే ఇడ్లీ... బజ్జీ అందిస్తూ దాదాపు పది రూపాయల్లో శుభ్రంగా కడుపు నిండేలా చేస్తున్నారు ఈ దంపతులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని