Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 25/07/2021 09:00 IST

Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. తెలుగు తేజం పీవీ సింధు శుభారంభం

టోక్యో ఒలింపిక్స్‌లో తెలుగు తేజం, భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు శుభారంభం చేసింది. గ్రూప్‌-జె తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన సెనియా పోలికర్పోవాపై విజయం సాధించింది. 21-7, 21-10 తేడాతో సింధు గెలుపొందింది. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. మనుబాకర్‌, యశస్విని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. మనుబాకర్‌ 12వ స్థానంలో, యశస్విని 13వ స్థానంలో నిలిచారు. 

2. మళ్లీ రాజుకొంటున్న లద్దాఖ్‌!

భారత్‌-చైనా దౌత్య, సైనిక చర్చలు కొనసాగుతున్నప్పటికీ లద్దాఖ్‌లో మళ్లీ వేడి రాజుకుంటోంది. ఈ ప్రాంతంలో రెండు దేశాలు తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నాయి. కొత్తగా వైమానిక స్థావరాలు నిర్మించడం, ప్రస్తుతమున్నవాటిని విస్తరించడం వంటి చర్యలకు డ్రాగన్‌ దిగుతోంది. లద్దాఖ్‌తో పాటు హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌కు చేరువలోనూ ఇలాంటి పరిణామాలు జరగడం కలకలం సృష్టిస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. కష్టాల కడలిని దాటి.. గెలిచాను

2016 రియో ఒలింపిక్స్‌ మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో పోటీ ముగిసింది. మీరాబాయి చాను అనే పేరు ముందు డీఎన్‌ఎఫ్‌ అని ఉంది.  అంటే ‘డిడ్‌ నాట్‌ ఫినిష్‌’ అని. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 3 ప్రయత్నాల్లో ఒక్కసారీ నిర్దేశించుకున్న బరువు మోయలేకపోయింది చాను. నాడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె నిష్క్రమిస్తుంటే.. ఆ పోటీ చూస్తున్న వారి నుంచి నిట్టూర్పులు, తిట్లు! అయిదేళ్ల తర్వాత ఇప్పుడు ఒలింపిక్‌ వేదిక మీద ఆమె ముఖంలో నవ్వులు విరబూస్తుంటే.. కోట్లమంది నుంచి కేరింతలు, ప్రశంసలు!  మీరా గొప్ప స్ఫూర్తి గాథ కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఏం చదివారు? ఏం చదవాలనుకుంటున్నారు?

రాష్ట్రంలో అక్షరాస్యత, విద్య పరిస్థితులను తెలుసుకునేందుకు సర్వే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా మంగళగిరి మండలంలోని కాజ, తాడేపల్లి పురపాలక సంఘంలో నిర్వహించారు. దీని ఫలితాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. త్వరలో వీటికి ఆమోదం లభించనుంది. ఈ-ప్రగతి, గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాల, ఉన్నత విద్యా శాఖల సహకారంతో ఈ సర్వేను నిర్వహించనున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. కరోనా కాలంలో... దారి మార్చారు దూసుకెళ్లారు!

ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు ఆందోళన సహజమే అయినా దాన్ని మించిన ఆలోచన అవసరం... అంటున్నారు ఈ వ్యాపారవేత్తలంతా. కరోనా లాక్‌డౌన్‌ వల్ల వేలాది వ్యాపార సంస్థలు శాశ్వతంగా మూతపడిన వేళ వీరు మాత్రం ఉన్న వనరులతోనే కొత్తగా ఏం చేయొచ్చా అని ఆలోచించారు. పరిస్థితులకు తగిన నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో చకచకా మార్పులు చేశారు. ఫలితంగా, మాంద్యంలోనూ లాభాలు అందుకుంటూ తమ అనుభవపాఠాలతో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు..! మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. రోదసి వేదికగా కాసుల వర్షం

ఇటీవలి వరకు ప్రభుత్వాలు, సైన్యాలు, టెలికమ్యూనికేషన్‌ సంస్థల గుత్త సొత్తుగా ఉన్న అంతరిక్షంలోకి ఇప్పుడు ప్రైవేటు కంపెనీలూ దిగాయి. చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ నెల 11న ఒక ప్రైవేటు సంస్థ (వర్జిన్‌ గెలాక్టిక్‌) ప్రయోగించిన రాకెట్‌లో యాత్రికులు భూకక్ష్యలోకి ప్రవేశించారు. వారిలో ఒకరు గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష కావడం తెలుగు వారికి గర్వకారణం. ఆమెతో కలుపుకొని ఇప్పటివరకు మొత్తం ముగ్గురు భారతీయ సంతతి మహిళలు అంతరిక్షయానం చేయడం జాతిని ఉత్తేజపరుస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. సినిమాలో ఒక్క పాట పాడితే చాలనుకున్నా!

పాట తనకు ప్రాణం... దాని కోసం చిన్నప్పటి నుంచీ సాధన చేసింది. సినిమాల్లో తన గొంతు వినిపించాలని తపించింది. అలుపెరగక ప్రయత్నించింది. ఇవి చేస్తూనే ఉన్నత విద్యార్హతలూ సంపాదించుకుంది... బాహుబలి నుంచి వకీల్‌సాబ్‌ వరకు... తన పాటలన్నీ హిట్లే. తాజాగా ‘బుల్లెట్‌బండి’ అంటూ ఆటతోనూ కట్టి పడేసింది. తనే ‘మోహనా భోగరాజు’. తన పాటల ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. కంటికి రెప్పలా.. కన్నవారి ఆసరా

బిడ్డ పుడుతుందంటే ఎన్నో కలలు. వాళ్లెలా ఉంటారోనన్న ఊహలు, ఇలా ఉంటే బాగుంటుందంటూ ఆశలు.. ప్రతి తల్లిదండ్రికీ సహజం. కానీ ఆ బిడ్డ బుద్ధిమాంద్యంతో పుడితే, అందరు పిల్లల్లాగా మాట్లాడలేరని, ఆటలాడలేరని తెలిస్తే.. ఆ అమ్మానాన్నల ఆవేదన ఊహించలేం. ఆ బాధను అణుచుకుంటూ.. మిగిలినవారితో సమానంగా తమ బిడ్డను నిలబెట్టాలన్న తపనతో వారు అనుక్షణం ప్రయత్నిస్తున్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అహరహం శ్రమిస్తున్న ఇలాంటి కొందరు తల్లిదండ్రుల గురించి.. తల్లిదండ్రుల దినోత్సవ వేళ ప్రత్యేక కథనం. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఇటు వరద నీళ్లు..అటు పసిపిల్లలు.. అందుకే ఆగలేదు వీళ్లు

విధి నిర్వహణ ముందు వారికి వాగు దాటడం కష్టం అనిపించలేదు. ప్రమాదమని తెలిసినా వైద్య సిబ్బంది.. చిన్నారులకు టీకాలు ఇచ్చేందుకు ముందుకే వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలం దంతనపల్లి జెండగూడ సమీపంలోని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. కుంచె ఇస్తారనుకుంటే... చీపురిచ్చారు!

సినిమా... కథకుడి ఊహ అయితే, కళా దర్శకుడి సృష్టి. కొన్ని సినిమాలు చూసినపుడు శ్రీకారం నుంచి శుభం వరకూ వేరే ప్రపంచంలోకి వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది. తెలుగు సినిమాల్లో అలాంటి ఎన్నో ఊహా ప్రపంచాలకు వాస్తవ రూపం ఇచ్చారు ఆర్ట్‌ డైరెక్టర్‌ బ్రహ్మ కడలి. పేరులోనే సృష్టికర్తని పెట్టుకున్న ఈయన తన ప్రయాణం గురించి ఏం చెబుతారంటే... మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని