Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

తాజా వార్తలు

Updated : 13/08/2021 13:28 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. విజయసాయి బెయిల్‌ రద్దుపై నిర్ణయం మీదే: కోర్టులో సీబీఐ మెమో దాఖలు

జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి  బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నిర్ణయాన్ని కోర్టుకే సీబీఐ వదిలిపెట్టింది. విచక్షణ మేరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. మరోవైపు సీబీఐ నిర్ణయంపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు గడువు కావాలని విజయసాయిరెడ్డి కోర్టును కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Boeing: బోయింగ్‌ 737 మ్యాక్స్‌లు మళ్లీ ఎగురుతాయ్‌!

అమెరికాకు చెందిన బోయింగ్‌ సంస్థ తయారు చేస్తున్న 737 మ్యాక్స్‌ విమానాలు గత రెండేళ్లుగా కార్యకలాపాలు నిర్వహించకుండా 195 దేశాలు నిషేధం విధించాయి. ఇందులో భారత్‌ కూడా ఉంది. ఇప్పుడు ఆ నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. కొత్తగా తయారైన విమానాలకు వెంటనే అనుమతులు ఇచ్చేసి, పాత వాటికి పరీక్షలు  నిర్వహించి, నెల రోజుల తరవాత అనుమతించే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tesla: సుంకం తగ్గిస్తాం సరే.. ఇంతకీ భారత్‌లో మీరేం చేస్తారు?

3. Viveka Murder Case: సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో 68వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం నాటి విచారణకు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డి హాజరయ్యారు. వివేకా హత్య కేసులో శంకర్‌రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Orey Baammardhi Review: రివ్యూ: ఒరేయ్ బామ్మ‌ర్ది

అటు తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగు వారికి ద‌గ్గ‌రైన న‌టుడు సిద్ధార్థ్‌. కొన్నేళ్లుగా తెలుగు తెర‌పై క‌నిపించ‌ని ఆయ‌న ఇప్పుడు ‘ఒరేయ్ బామ్మ‌ర్ది’తో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించారు. ఇందులో జి.వి.ప్ర‌కాష్ మ‌రో క‌థానాయ‌కుడిగా న‌టించారు. ‘బిచ్చ‌గాడు’ వంటి హిట్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు శ‌శి నుంచి వ‌స్తున్న చిత్రం కావ‌డంతో అంద‌రి దృష్టి దీనిపై ప‌డింది. దీనికి త‌గ్గ‌ట్లుగానే  టీజ‌ర్‌, ట్రైలర్లు ఆస‌క్తిరేకెత్తించేలా ఉండ‌టంతో ఆ అంచ‌నాలు రెట్టింప‌య్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Pushpa: దాక్కో దాక్కో మేక.. వచ్చేసింది పులి..!

5. Bandi Sanjay: బండి సంజయ్‌ పాదయాత్రకు పేరు ఖరారు

భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన పాదయాత్ర పేరును భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌ ప్రకటించారు. చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మాజీ మంత్రులు బాబూమోహన్‌, చంద్రశేఖర్‌తో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బండి సంజయ్‌ పాదయాత్రకు ‘ప్రజా సంగ్రామ యాత్ర’గా నామకరణం చేసినట్లు రాజాసింగ్‌ ప్రకటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. KL Rahul love affair with London: లండన్‌తో రాహుల్‌ లవ్‌ అఫైర్‌!

టీమ్‌ఇండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌కు లండన్‌ నగరంతో ఏదో ప్రేమబంధం (లవ్‌ అఫైర్‌) ఉన్నట్టుంది! ఎందుకంటే టెస్టుల్లో అతడు చివరి రెండు శతకాలు చేసింది ఈ నగరంలోనే కావడం విశేషం! అదీ మూడేళ్ల అంతరంతో సాధించాడు. మునుపెన్నడూ లేనంత సానుకూల దృక్పథంతో కేఎల్‌ రాహుల్‌ క్రికెట్‌ ఆడుతున్నాడు. తనలోని సొగసరి స్ట్రోక్‌ప్లేను ప్రదర్శిస్తున్నాడు. కళాత్మక షాట్లతో అలరిస్తున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రాహుల్‌, రోహిత్‌.. దంచుడే దంచుడు! వీడియో చూస్తారా! 

7. China: కరోనా భయంతో ప్రజలను ఇళ్లల్లో పెట్టి తాళం వేసి.. ఇనుపరాడ్లు అడ్డుపెట్టి..

కరోనా మహమ్మారి పుట్టినిల్లు చైనాలో మరోసారి వైరస్‌ విజృంభిస్తోంది. డెల్టా వేరియంట్‌ కారణంగా అక్కడ గత కొన్ని రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రాగన్‌ ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపడుతోంది. ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు వారిని ఇంట్లోనే బందీలుగా చేసి అధికారులు బయట నుంచి తాళాలు వేస్తున్నారు. తలుపుల ముందు ఇనుప రాడ్ల పెట్టి ఇంటిని సీల్‌ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Japan: ఈశాన్య జపాన్‌లో రెండు ముక్కలైన నౌక

ఈశాన్య జపాన్‌లోని అమోరి ఫ్రిఫెక్చర్‌ హచినొహె పోర్టు సమీపంలో నేలను తాకడంతో రెండు ముక్కలైన పనామాకు చెందిన చమురు రవాణా నౌక క్రిమ్సన్‌ పొలారిస్‌. బుధవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించిందని, నౌకలోని చమురు సముద్రం పాలవడంతో గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి ఆ ప్రాంతంలో 24 కిలోమీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పున తెట్టు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Rahul Gandhi: ట్విటర్‌ మనకు రాజకీయాలు నేర్పుతోందా?

సోషల్‌మీడియా సంస్థ ట్విటర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆ సంస్థ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, తన ఖాతాను నిలిపివేసి దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోందని దుయ్యబట్టారు. మనకు రాజకీయాలు నేర్పాలని చూస్తోందని ధ్వజమెత్తారు. దిల్లీలో హత్యాచారానికి గురైన ఒక దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించి, ఆ చిత్రాలను పంచుకున్నందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఖాతాను ట్విటర్‌ ఇటీవల తాత్కాలికంగా స్తంభింపజేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

India to UK flights: కొండెక్కిన టికెట్‌ ధరలకు కళ్లెం! 

10. India Corona: 40 వేల కేసులు.. 42 వేల రికవరీలు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసులు, మరణాల్లో అవే హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 19,70,495 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 40,120 కేసులు వెలుగుచూశాయి.  అంతకు ముందు రోజుతో పోల్చితే కేసుల్లో 2.6 శాతం తగ్గుదల కనిపించింది. మరణాలు మరోసారి 500 దాటాయి. నిన్న మహమ్మారి ధాటికి 585 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.21 కోట్లు దాటగా.. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 4,30,254 గా ఉందని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని