close

తాజా వార్తలు

Updated : 04/05/2021 21:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

Top 10 news @ 9PM

1. భారత్‌లో నాయకత్వ లేమిని కొవిడ్‌ చూపింది..!

భారత్‌లో నాయకత్వలేమి, ముందు చూపు కొరత, తొందరగా సంతృప్తి పడే లక్షణాలకు పెరిగిపోతున్న కొవిడ్‌ కేసులే ఉదాహరణగా నిలిచాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌, ఆర్థిక వేత్త రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒక వేళ మనం అప్రమత్తంగా ఉంటే.. జాగ్రత్తగా వ్యవహరిస్తే.. ఇప్పుడు ఇలా జరిగేది కాదని గ్రహించాలి.  ప్రపంచంలో మిగిలిన చోట్ల ఏం జరిగిందా అని ఎవరైనా దృష్టి పెడితే తెలిసేది’’ అని వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. Corona: ఏపీలో భారీగా కొత్త కేసులు 

ఏపీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. కొత్తగా మరో 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,15,784 శాంపిల్స్‌ పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 20,034 మందికి పాజిటివ్‌గా (17.3% పాజిటివిటీ) నిర్ధారణ అయినట్టు  ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ వెల్లడించారు. అలాగే, 82 మంది మృతి చెందినట్టు చెప్పారు. వైరస్‌ బారిన పడి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో కొత్తగా 176 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించిన ఆయన.. ఇందుకోసం రూ.346 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. Anthony Fauci: సంక్షోభ వేళ సైన్యాన్ని దించండి!

 కరోనా వైరస్‌ వల్ల భారత్‌లో ఏర్పడ్డ అసాధారణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సైన్యాన్ని రంగంలోకి దించడంతోపాటు అన్ని వనరులను వినియోగించుకోవాలని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ సూచించారు. వైరస్‌ ఉద్ధృతి, సదుపాయాల కొరత ఉన్న ప్రాంతాల్లో సైన్యం సహాయంతో తాత్కాలిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. కేవలం వైద్య పరికరాలే కాకుండా సిబ్బంది కోసం ఇతర దేశాల సహాయాన్ని భారత్‌ తీసుకోవాలని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. WhatsApp: వ్యాక్సిన్‌ సెంటర్‌ తెలుసుకోండిలా!

దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా సాగుతోంది. రోజుకు మూడు లక్షలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్రం జోరు పెంచింది. దాని కోసం cowin.gov.inలో రిజిస్టర్‌ చేసుకోమని కోరింది. ఆరోగ్య సేతు, ఉమంగ్ యాప్‌లలో కూడా రిజిస్టర్‌ చేసుకోమని తెలిపింది. ఒకవేళ మీరూ వ్యాక్సిన్‌ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు అందించడానికి ఓ వాట్సాప్‌ బాట్‌ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఆ బాట్‌ను మీకు వాక్సినేషన్‌కు సంబంధించిన వివరాలను అందిస్తుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. సంపూర్ణ లాక్‌డౌన్‌ ఒక్కటే మార్గం: రాహుల్‌ గాంధీ

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్రం చేపట్టిన చర్యలేవీ కరోనాను నియంత్రించలేకపోయాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ఇక మహమ్మారి కట్టడి ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం లాక్‌డౌన్‌ ఒక్కటేనని అభిప్రాయపడ్డారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. coronavaccine: ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతి

రోజు రోజుకీ కరోనా వైరస్‌ ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు అనుమతి ఇచ్చింది. 45 ఏళ్లు పైబడి, కొవిన్‌ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వాళ్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చు. అయితే, ప్రైవేటు సెంటర్లు/ఆస్పత్రులకు ప్రభుత్వం ఎలాంటి వ్యాక్సిన్‌ సరఫరా చేయదు. వారే సొంతంగా కంపెనీల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. ‘Corona కేసులు పెరిగితే చర్యలేంటి?’

రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారని.. ఆక్సిజన్‌ అందక రోగులు చనిపోతే పరిస్థితేంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రంలో కొవిడ్ చికిత్సపై సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, సివిల్ లిబర్టీస్ దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆక్సిజన్, పడకలు, ఔషధాలు, కొవిడ్ పరీక్షల ఫలితాలు , వ్యాక్సినేషన్‌ వంటి కీలకాంశాలపై గంటన్నరకు పైగా విచారణ జరిపింది. అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ను హైకోర్టు నియమించింది. మరణించిన వారికి గౌరవప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. మీ కోవిడ్ పాలసీ క్లెయిమ్ తిర‌స్క‌రించారా.. కార‌ణాలు ఇవే కావ‌చ్చు..

కోవిడ్ కేసుల సంఖ్య పెరిగేకొద్దీ, బీమా క్లెయిమ్‌లు కూడా పెరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన క్లెయిమ్‌ల‌ను వేగ‌వంతంగా పరిరక్షించుకునేందుకు సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే కొన్ని క్లెయిమ్‌లు మాత్రం తిర‌స్క‌ర‌ణ‌కు గురవుతున్నాయి. పాల‌సీదార‌డు ఆసుపత్రిలో చేరినప్పుడు,  కొన్ని కారణాలతో బీమా సంస్థ క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రించే అవ‌కాశం ఉంది లేదా క్లెయిమ్‌ల‌ను పూర్తిగా పరిష్కరించక‌పోవ‌చ్చు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. AP: మద్యం అమ్మకం వేళలు కుదింపు

ఏపీలో కరోనా ఉద్ధృతిని కట్టడి చేసేందుకు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మద్యం అమ్మకాల వేళలను కుదించారు. దీంతో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే 20వేలకు పైగా కొవిడ్‌ కొత్త కేసులు రాగా.. 82మందికి పైగా మరణించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. JEE Main పరీక్షలు వాయిదా 

 దేశంలో కరోనా ఉద్ధృతి దృష్ట్యా జేఈఈ మెయిన్‌ (మే సెషన్) పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ పరీక్షలను నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసినట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ వెల్లడించారు. మే 24 నుంచి 28వరకు మే సెషన్‌ జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు జరగాల్సి ఉంది.  తదుపరి అప్‌డేట్స్‌ కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించాలని విద్యార్థులకు పోఖ్రియాల్‌ విజ్ఞప్తి చేశారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని