మేం సెలబ్రెటీల్లా ఫీల్‌ అవుతున్నాం!

తాజా వార్తలు

Published : 21/07/2021 01:11 IST

మేం సెలబ్రెటీల్లా ఫీల్‌ అవుతున్నాం!

టీకా పొంది.. వందో యేటలోకి అడుగుపెట్టారీ బామ్మలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉత్సాహానికి నిలువెత్తు నిదర్శనం ఈ బామ్మలు. అంతేకాదు.. ఆదర్శంలోనూ అదే తీరు. ఇక్కడ కనిపించే ఈ ముగ్గురి బామ్మలు పేర్లు రూత్‌, లోరైన్‌, ఎడిత్‌. ఈ ముగ్గురూ స్నేహితులు. అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. ఇటీవలే వ్యాక్సిన్‌ తీసుకున్న వీరు.. రోజుల వ్యవధిలోనే వందో యేటలోకి అడుగుపెట్టారు. ఈ శుభ సందర్భాన్ని తమ కుటుంబ సభ్యుల నడుమ జరుపుకొన్నారు, షాంపైన్‌ బాటిల్‌ పైకెత్తి గ్లాసులతో ఛీర్స్‌ అంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇందులో ఎడిత్‌ అనే ఆమె తన తండ్రి ఫర్నిచర్‌ వ్యాపారాన్ని చూసుకొనేవారని చెప్పగా, అంధ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు బోధించి రిటైర్‌ అయ్యానని చెప్పారు మరో బామ్మ రూత్‌. బ్రిడ్జ్‌ ప్లేయర్‌గా రాణించిన లోరైన్‌ కొన్నాళ్లకు టెన్నిస్‌ నేర్చుకున్నాని.. 90 ఏళ్లప్పుడు ఆడేదాన్నంటూ తన పాత రోజుల్ని ఆనందంగా గుర్తు చేసుకున్నారు. మీరంతా టీకా తీసుకొని వందో యేటలోకి అడుగుపెట్టారు కదా..! ఎలా ఫీల్‌ అవుతున్నారని అక్కడున్న వారు అడగగా.. సెలబ్రెటీల్లాగా అంటూ నవ్వేశారు. అరుదుగా జరిగే ఇలాంటి వేడుకను సుమారు 40 ప్రముఖ అంతర్జాతీయ న్యూస్‌ ఏజెన్సీలు కవరేజీ ఇవ్వగా.. ఇటీవలి ‘పీపుల్‌ మ్యాగజీన్‌’ సంచికలోనూ ఈ బామ్మల గురించి ప్రచురించారు. కాగా ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘అట్రియాసినీయర్‌లివింగ్‌’ అనే సీనియర్‌ సిటిజన్స్‌ ఇన్‌స్టా పేజీ పంచుకుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని