ఆ దేశంలో ఆనందం ఎక్కువ..!

తాజా వార్తలు

Updated : 20/03/2021 13:25 IST

ఆ దేశంలో ఆనందం ఎక్కువ..!

సంతోషకరమైన దేశాల జాబితా వెల్లడి..

ఫిన్‌లాండ్‌: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ విజృంభిస్తున్నా.. సంతోషకరమైన దేశాలలో ఫిన్లాండ్‌ మొదటి స్థానంలో నిలిచిందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 149 దేశాల్లోని ప్రజల అభిప్రాయాలను సేకరించిన అనంతరం వార్షిక నివేదికను విడుదల చేసింది. నాలుగేళ్లుగా ఫిన్లాండ్‌ ప్రజలు అందరికన్నా ఎక్కువ ఆనందంగా గడుపుతున్నట్లు వెల్లడించింది. ఐరోపా‌ దేశాలైన డెన్మార్క్‌, స్విట్జర్లాండ్‌, ఐస్‌లాండ్‌, నెదర్లాండ్స్‌లు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయని వెల్లడించింది.

గతేడాదితో పోలిస్తే సంతోషకరమైన దేశాల్లో న్యూజిలాండ్ 9వ స్థానంలోకి రాగా... జర్మనీ 17 నుంచి 13వ స్థానానికి, ఫ్రాన్స్‌ 2 నుంచి 21 స్థానానికి చేరినట్లు నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఆఫ్రికా దేశాలైన లెసోతో, బోట్స్వానా, రువాండా, జింబాబ్వే చివరి స్థానాల్లో ఉన్నాయి. కాగా ఈ సంవత్సరానికి గానూ సంతోషంగా లేని (అన్‌హ్యాపీ) దేశాల్లో అఫ్గానిస్థాన్‌ తొలి స్థానంలో నిలిచిందని సర్వే అధికారులు చెబుతున్నారు.

దేశ ప్రజల ఆనందం, వ్యక్తిగత స్వేచ్ఛ, సామాజిక బాధ్యత, దేశ జీడీపీ, అవినీతి స్థాయులను పరిగణనలోకి తీసుకొని ఈ నివేదిక రూపొందించారు. తొమ్మిదేళ్లుగా సంతోషకరమైన దేశాల జాబితాలను విడుదల చేస్తున్నామని ఐరాస‌ పరిశోధకుడు హిల్లివెల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ‘కరోనా కాలంలోనూ.. ఫిన్‌లాండ్‌లో ఎక్కువ శాతం జనాభా ఆనందంగా జీవిస్తున్నారు. మహమ్మారి సమయంలో ఫిన్‌లాండ్‌ ప్రజలు వారి జీవనోపాధిని కాపాడుకొనేందుకు చాలా కృషి చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఆత్మవిశ్వాసంతో జీవిస్తున్నారు. అది వారి ముఖాల్లో కనిపించింది. ఇక్కడ విస్తారమైన అడవులు, వేలాది సరస్సులు , నిశ్శబ్ద వాతావరణం ఉండటం ప్రజల జీవనానికి అనుకూలం ’అని హిల్లివెల్ వివరించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని