Ts Eamcet Hall Tickets: వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు.. 29 వరకు దరఖాస్తుకు అవకాశం

తాజా వార్తలు

Published : 23/07/2021 21:28 IST

Ts Eamcet Hall Tickets: వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు.. 29 వరకు దరఖాస్తుకు అవకాశం

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొ. గోవర్దన్ తెలిపారు. నేటి నుంచి ఈనెల 31 వరకు విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. బిట్‌శాట్, ఎంసెట్ ఒకే రోజు ఉన్న విద్యార్థులు.. సమాచారం ఇస్తే మరో రోజుకు మారుస్తామన్నారు. ఇవాళ్టి వరకు ఇంజినీరింగ్‌ కోర్సులకు 1.63 లక్షలు, వ్యవసాయ, ఫార్మా కోర్సులకు 85,828 మంది విద్యార్థులతో కలిపి మొత్తంగా 2.49 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఎంసెట్‌కు రూ.500 ఆలస్య రుసుముతో ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఆగస్టు 4 నుంచి 10 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని