Rajya Sabha: ఏడేళ్లలో ఏపీకి చేసిన ఆర్థిక సాయం వివరాలు వెల్లడించిన కేంద్రం

తాజా వార్తలు

Updated : 10/08/2021 21:33 IST

Rajya Sabha: ఏడేళ్లలో ఏపీకి చేసిన ఆర్థిక సాయం వివరాలు వెల్లడించిన కేంద్రం

దిల్లీ: ఏడేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం అందించిన ఆర్థిక సాయం వివరాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల కింద గతేడాది రూ.12,851 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఇతర పథకాల కింద రూ.621 కోట్లు రాష్ట్రానికి ఇచ్చినట్లు వెల్లడించారు. ఏపీకి విభజన చట్టం కింద ఇప్పటివరకు రూ.19,427.366 కోట్లు అందించినట్లు వివరించారు. 2014-15 నుంచి వివిధ గ్రాంట్ల రూపంలో ఏపీకి రూ.59,496.81 కోట్లు ఇచ్చామన్నారు. విదేశీ సంస్థల సహాయంతో రూ.39,343 కోట్లతో 14 ప్రాజెక్టులను చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని