Ts News: గులాబీ పండుగకు ఏర్పాట్లు మెండుగా..

తాజా వార్తలు

Updated : 24/10/2021 17:52 IST

Ts News: గులాబీ పండుగకు ఏర్పాట్లు మెండుగా..

హైదరాబాద్‌: నాలుగేళ్లకోసారి జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి హైదరాబాద్ హైటెక్స్ వేదికగా మారింది. ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరం గులాబీమయంగా మారింది. హైటెక్స్‌లో రేపు జరగనున్న ప్లీనరీకి గులాబీ పార్టీ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 6 వేలకు పైగా పార్టీ ప్రతినిధులు హాజరు కానున్న సభలో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిగా రేపు లాంఛనంగా ఎన్నుకోనున్నారు. ఏప్రిల్ లోనే ప్లీనరీ జరగాల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6వేల మంది తెరాస ప్రతినిధులు రేపటి ప్లీనరీకి హాజరుకానున్నారు. ప్రతినిధులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. మహిళలకు గులాబీ చీర, పురుషులు గులాబీ చొక్కాతో సభకు హాజరుకావాలని పార్టీ నాయకత్వం ఇప్పటికే నిర్దేశించింది. సుమారు 300 అడుగుల వేదికను ముస్తాబు చేస్తున్నారు. ప్లీనరీ వేదికపై దుర్గం చెరువుపై ఉన్న తీగల వంతెన, వరంగల్‌లోని కాకతీయ తోరణం సభా వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

ప్లీనరీలో తెరాస అధ్యక్షుడిని ఎన్నుకోవడంతో పాటు పలు రాష్ట్ర, జాతీయ అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. తెరాస ప్రతినిధులతో పాటు వారి వెంట వచ్చే సహాయకులందరితో కలిపి దాదాపు 15వేల మందికి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేతృత్వంలో ప్రత్యేక వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేయనున్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని