Ganesh Idols: చెత్త ట్రాక్టర్లలో వినాయక విగ్రహాల తరలింపు ఘటన.. అధికారిపై వేటు

తాజా వార్తలు

Updated : 07/09/2021 12:51 IST

Ganesh Idols: చెత్త ట్రాక్టర్లలో వినాయక విగ్రహాల తరలింపు ఘటన.. అధికారిపై వేటు

గుంటూరు: గుంటూరులో చెత్తను తరలించే వాహనాల్లో వినాయక విగ్రహాలను తరలించిన పారిశుద్ధ్య సిబ్బందిపై కమిషనర్‌ అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శానిటరీ సూపర్‌ వైజర్‌ను విధుల నుంచి తొలగించారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా అత్యుత్సాహంతో వినాయక విగ్రహాలను పారిశుద్ధ్య ట్రాక్టర్‌లో వేసి తీసుకెళ్లడంపై ఆమె మండిపడ్డారు. ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్‌తో విచారణకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ తెలిపారు.

నగరంలోని జ్వరాల ఆసుపత్రి సమీపంలో రహదారి వెంబడి కొందరు వినాయక విగ్రహాలను విక్రయిస్తున్నారు. అనుమతి లేదంటూ నిన్న గుంటూరు నగరపాలక సంస్థ సిబ్బంది విగ్రహాలను బలవంతంగా వాహనాల్లో తీసుకెళ్లారు. గణపతి విగ్రహాలను చెత్త ట్రాక్టర్లలో ఎక్కించి తరలించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో కమిషనర్‌ చర్యలకు ఉపక్రమించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని