Ap News: గత పదేళ్లతో పోలిస్తే గతేడాదే ఎక్కువ గంజాయి స్వాధీనం: డీజీపీ

తాజా వార్తలు

Updated : 26/10/2021 19:35 IST

Ap News: గత పదేళ్లతో పోలిస్తే గతేడాదే ఎక్కువ గంజాయి స్వాధీనం: డీజీపీ

రాజమహేంద్రవరం: రానున్న రోజుల్లో గంజాయి నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అన్ని జిల్లాల ఎస్పీలు, ఉన్నతాధికారులతో మాదకద్రవ్యాల నియంత్రణపై డీజీపీ సమీక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నెలపాటు గంజాయిపై లోతైన అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. ఎన్‌ఐఏ సహకారంతో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ స్పష్టం చేశారు. ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా గంజాయి సాగు చేస్తున్నారన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 2.90 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. గత పదేళ్లతో పోలిస్తే గతేడాది స్వాధీనం చేసుకున్న గంజాయే ఎక్కువ అని డీజీపీ వివరించారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని