AP News: పోలవరంలో సీఎం జగన్‌ పర్యటన

తాజా వార్తలు

Updated : 19/07/2021 15:56 IST

AP News: పోలవరంలో సీఎం జగన్‌ పర్యటన

పోలవరం: ఏపీ సీఎం జగన్‌ పోలవరం పర్యటనకు వెళ్లారు. ప్రాజెక్టు పురోగతిని తెలుసుకునేందుకు పోలవరం పరిసరాల్లో విహంగ వీక్షణం ద్వారా పనులను ఆయన పరిశీలించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎంకు వివరించారు. స్పిల్‌ వే, అప్రోచ్‌ ఛానల్‌ పనులపై ఆయన అడిగి తెలుసుకున్నారు. స్పిల్‌ వే పనుల ఛాయా చిత్రాలను జగన్‌ పరిశీలించారు. పనుల తీరును ఈఎన్‌సీ నారాయణరెడ్డి సీఎంకు వివరించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో జగన్‌ సమీక్షించారు. అంతకుముందు పోలవరం వ్యూ పాయింట్‌ వద్ద నుంచి గోదావరి నదీ ప్రవాహ మార్గాన్ని సీఎం జగన్‌ పరిశీలించి వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని