Bathukamma: నేడు రాత్రి బుర్జ్‌ ఖలిఫాపై బతుకమ్మ సంబురం

తాజా వార్తలు

Updated : 23/10/2021 22:15 IST

Bathukamma: నేడు రాత్రి బుర్జ్‌ ఖలిఫాపై బతుకమ్మ సంబురం

దుబాయ్‌: తెరాస ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ ఘనతను మరోసారి విశ్వవేదికపై చాటనున్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన దుబాయ్‌లోని బుర్జ్‌ఖలీఫాపై ఈరోజు రాత్రి 9.40 నిమిషాలకు, 10.40 నిమిషాలకు బతుకమ్మ వీడియో ప్రదర్శించనున్నారు. మూడేసి నిమిషాల నిడివిగల ఈ వీడియోల్లో తెలంగాణలో బతుకమ్మ ప్రాశస్త్యం, విశిష్టత, సంబురాల సంస్కృతిని తెలియజేస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాన్ని సైతం మొత్తం సౌధంపై ప్రదర్శిస్తారు. బుర్జ్‌ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించబోయే తెర ప్రపంచంలోనే అతి పెద్దది. ఒకేసారి లక్ష మంది దీన్ని వీక్షించనున్నారు.

ఈ కార్యక్రమం కోసం దుబాయ్‌ చేరుకున్న కవిత బృందానికి ప్రవాసులు ఘనంగా స్వాగతం పలికారు. ఆమె వెంట ఎమ్మెల్యేలు బాజిరెడ్డి, గణేశ్‌ గుప్తా, సురేందర్‌, షకీల్‌, జీవన్‌రెడ్డి, సంజయ్‌, రాజ్యసభ సభ్యులు సురేశ్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. దుబాయ్ వీధుల్లో భారీ ర్యాలీతో వీరికి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం చెప్పారు. బతుకమ్మ పండుగ ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు కవిత ఈ సందర్భంగా తెలిపారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని